సనాతన ధర్మంలో పూజకు( Puja ) సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి.ఈ నియమాలలో ఒకటి మధ్యాహ్నం సమయంలో దేవుడిని పూజించకూడదు.
ఈ నియమాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు.మధ్యాహ్నం పూట భగవంతుడిని ఎందుకు పుజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సాంస్కృతి సంప్రదాయాలలో( Hindu cultural traditions ) రోజు వారి దినచర్యలో ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని తమ జీవితాలలో ముందుకు సాగేందుకు ప్రేరణ పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారుజామున పూజకు ఉత్తమమైన సమయంగా భావిస్తారు.ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం, మనసు రెండు స్వచ్ఛంగా ఉంటాయి.ఇది భగవంతుని ఆరాధనలో మన దృష్టిని, భక్తిని కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది.అలాగే మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టినప్పుడల్లా శుభ ముహూర్తం కోసం చూస్తూ ఉంటాము.
సరైన సమయంలో చేసే పూజలను భగవంతుడు స్వీకరిస్తాడు.అనేది దాని వెనుక అసలు కారణం.
అంటే ఇతర సమయాలలో చేసే పూజల వల్ల మనకు ప్రయోజనం ఉండదు.
ముఖ్యంగా చెప్పాలంటే రోజుకు కనీసం ఐదు సార్లు భగవంతుడిని పూజించాలని పెద్దలు చెబుతూ ఉంటారు.తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurat )లో మొదటి పూజ, ఉదయం 9 గంటలకు రెండవ పూజా, మధ్యాహ్నం 12 గంటల వరకు మూడవ పూజ, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాల్గవ పూజా, రాత్రి 9 గంటలకు ముందు ఐదవ పూజ చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం పూజ చేసిన ఫలితం ఉండదని ఆ సమయంలో పూజించిన ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు.
దీనికి కారణం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య భగవంతుడు విశ్రాంతి తీసుకునే సమయం.కాబట్టి ఈ సమయంలో చేసే పూజను ఆయన అంగీకరించాడు.
ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అని అంటారు.ఇది పూర్వకాలం నుంచి కొనసాగిస్తున్నారు.
అందుకే భగవంతుడు ఈ పూజను లేదా ప్రార్థనను అంగీకరించడు.
LATEST NEWS - TELUGU