వైరల్ వీడియో: ఫ్యూచరిస్టిక్ టెస్లాని మన పద్ధతిలో పూజిస్తే ఎలా ఉంటుందో చూడండి..

కొత్త కారు కొన్న వెంటనే మన దేశంలో వాహన పూజ చేయడం ఆనవాయితీ.గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తారు లేదా ఇంటికి పంతులుని పిలిచి మరీ బండికి దిష్టి తగలకుండా పూజ చేయిస్తారు.

 See What It Would Be Like To Worship The Futuristic Tesla In Our Style In The Vi-TeluguStop.com

కొబ్బరికాయ కొట్టడం, కుంకుమ బొట్లు పెట్టడం, పూలతో, తోరణాలతో బండిని అలంకరించడం వంటివి చేస్తారు.

అయితే ఇటీవల పూణేకి( Pune ) చెందిన ఆశిష్( Ashish ) అనే X యూజర్ కొత్త టెస్లా కారు కొన్నాడు.

మన సంప్రదాయం ప్రకారం అచ్చంగా వాహన పూజ చేశాడు.ఫ్యూచరిస్టిక్ లుక్ ఉన్న నల్లటి టెస్లా కారుని సంప్రదాయ పద్ధతిలో ముస్తాబు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు కూడా.

హైటెక్ ఎలక్ట్రిక్ కారుకి మన పాత సంప్రదాయపు పూజలు ఏంట్రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.ఈ వింత కాంబినేషన్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఆశిష్ తన టెస్లా కారు ( Tesla car )ఫొటోని ఎక్స్‌లో షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టాడు.అందులో “మా అమ్మగారు ఫ్యూచరిస్టిక్ టెస్లా కొన్నా వినలేదు.మన పద్ధతిలో పూజ చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ చేయించింది” అని రాసుకొచ్చాడు.దాంతో పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది.మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది.టెక్నాలజీ ఎంత కొత్తగా ఉన్నా మన సంప్రదాయాలని వదలకూడదని ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్లు నవ్వుతూ, మెచ్చుకుంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.టెస్లా కార్లు కూడా మన రోడ్ల మీద త్వరలో కామన్ అయిపోతాయేమో అని కొందరు అంటే.పూల అలంకరణ చూసి మాత్రం చాలామంది నవ్వకున్నారు.ఒక యూజర్ అయితే ఈ అలంకరణ చూసి మొదట అది శవం పెట్టె అనుకున్నాడట.అంతలా డెకరేషన్ చేశారు మరి.ఇంకొందరు అయితే ఇది పెళ్లి మండపంలా ఉంది అని, పెళ్లి కొడుకు గ్రాండ్ గా వెళ్లే గుర్రపు బగ్గీలా ఉందని కామెంట్లు చేశారు.ఒకరైతే సరదాగా “పూకీ సైబర్ ట్రక్” అని పేరు కూడా పెట్టేశారు.మన సంప్రదాయాలని ఇంకా బతికిస్తున్న భారతీయ తల్లులని ఒక యూజర్ మెచ్చుకుంటే, గతం, భవిష్యత్తు కలిసిన ఈ సీన్ చాలా బాగుందని ఇంకొకరు పొగిడారు.

టెక్నాలజీ ఎంత దూరం వెళ్లినా మన సంప్రదాయాలు మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి అని ఈ వైరల్ పోస్ట్ నిరూపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube