ప్రతి ఒక్కరి కథ మాస్టర్ పీస్ అవుతుంది.. హీరోయిన్ సమంత కామెంట్స్ వెనుక అర్థం ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మన అందరికి తెలిసిందే.సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే.

 Samantha Shares Something On Womens Day, Samantha, Womens Day, Tollywood, Post V-TeluguStop.com

గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.మళ్లీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో( social media ) మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.తరచూ ఏదోక పోస్టుతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సమంత.అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’s Day )సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ కూడా చేశారు.

ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.తుఫానులను దయతో నావిగేట్‌ చేసేది.ప్రపంచాన్ని తన నిశ్శబ్ద కౌగిలిలో పట్టుకున్నది.అడుగడుగునా కలలను బ్యాలెన్స్‌ చేసేది, ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా పైకి లేచేది.

తిరిగి అడగకుండా ఇచ్చేది, ఆవేశంతో రగిలిపోయేది, అయినా ఆరాటపడుతూనే ఉంటుంది, భారాలు, కాంతి రెండింటినీ మోసే ఆమె చీకటి రాత్రిలో కూడా ప్రకాశిస్తుంది.అవన్నీ తప్పిపోకుండా చేస్తుంది, తను ఎదుర్కొన్న ప్రతి సవాల్‌ తిప్పికొడుతుంది.

Telugu Samantha, Samanthawomens, Tollywood, Womens Day-Movie

ఆమె తన శక్తితో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అని సమంత రాసుకొచ్చింది.అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దీనితో పాటు మరో వీడియోను కూడా షేర్‌ చేశారు.ఎర్లీ మార్నింగ్‌ లైఫ్‌, ఒక వాగ్దానం, ఒక ఆశ, చిన్న కల, ఏదో ధైర్యం, చేయగలననే నమ్మకం తను ఏదో రాయాలనుకుంటుంది అంటూ వీడియోలో తెలిపింది.

ఈ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూనే ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube