ఆ ఊరి లోకి అడుగు పెడితే మన కళ్ళను మనమే నమ్మలేము.అంతలా ఆ ఊరిలో ఏముందా అని అనుకుంటున్నారా.
ఆ ఊరిలో అడుగడుగు బొమ్మలే దర్శన మిస్తాయి.అవి మాములు బొమ్మలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.
ఆ బొమ్మలను చూస్తే అస్సలు మనం నమ్మలేము.అంత సంజీవముగా ఉంటాయి.
ఆ దృశ్యాలు మన కళ్ళకు కనువిందు చేస్తాయి.
అంత అద్భుతంగా ఉన్న బొమ్మలు ఎక్కడ ఉన్నాయో అని అనుకుంటున్నారా.
కర్ణాటక రాష్ట్రం లోని హవేరి జిల్లా గోటగోడి ఊరిలో ఉన్న ఉత్సవ్ రాక్ గార్డెన్ లో ఈ బొమ్మలు మీకు దర్శన మిస్తాయి.మీరు కర్ణాటక వెళ్తే ఇక్కడకు వెళ్లకుండా అస్సలు మిస్ అవ్వొద్దు.
ఎందుకంటే మీరు ఒక గొప్ప అనుభూతిని మిస్ అవుతారు.మన హైదరాబాద్ లో ఉన్న శిల్పారామం లో బొమ్మలు ఎలా దర్శన మిస్తాయో.
అక్కడ అంతకంటే పెద్ద స్థలంలో ఈ బొమ్మలు మీకు కనిపిస్తాయి.
ఇక్కడ ఉన్న గార్డెన్ లో ఏ ప్రదేశం చుసిన జీవ కల ఉట్టి పడుతుంది.

అంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడ బొమ్మలు.ఆ బొమ్మల దగ్గరకు వెళ్లే వరకు తెలియదు.అవి బొమ్మలని.ఎందుకంటే అవి అంత సజీవంగా ఉన్నట్టు కనిపిస్తాయి.ఆ గార్డెన్ లో ఒక సంతలో జనం ఎలా వెళ్లి కొనుగోలు చేస్తారో అలానే ఆ బొమ్మలు రూపు దిద్దుకుని చూడడానికి చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి.

పూర్వపు రోజుల్లో పల్లె వాతావరణం ఎలా ఉంటుందో అచ్చం అలానే పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ఆ గార్డెన్ లో మనం చూడవచ్చు.దీనిని డాక్టర్ టి.బి.సోలబక్కనవర్ స్థాపించాడు.గార్డెన్ అంటే చిన్నది అనుకునేరు ఒక ఊరంతా స్థలంలో 1000 కి పైగా బొమ్మలతో ఈ గార్డెన్ చక్కగా రూపుదిద్దుకుంది.
ఈ గార్డెన్ సందర్శకులు కోసం వారమంతా అందుబాటులో ఉంటుంది.మీరు కూడా వీలైతే తప్పకుండ ఈ గార్డెన్ ను సందర్శించండి.