పురందేశ్వరి ముందున్న సవాళ్ళు ఇవే..!

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ( BJP ) వివిధ రాష్ట్రాలలో సంస్థాగత మార్పులు చేసిన సంగతి తెలిసిందే.అందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు ను తప్పించి ఆ బాద్యతను పురందేశ్వరికి( Purandeswari ) అప్పగించింది బీజేపీ అధిష్టానం.

 These Are The Challenges Ahead Of Purandeshwari Details, Bjp, Ap Bjp Chief Puran-TeluguStop.com

కాగా ఆ పదవి పురందేశ్వరి ని వరిస్తుందని బహుశా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఊహించి ఉండరేమో.కానీ కాషాయ అధిష్టానం మాత్రం పురందేశ్వరికే అధ్యక్ష పదవి అప్పగించి ముక్కున వేలేసుకునేలా చేసింది.

ఇదిలా ఉంచితే కొత్తగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పదవి బాద్యతలు చేపట్టిన పురందేశ్వరి.పార్టీకి సంబంధించి కొన్ని సవాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.

Telugu Apbjp, Ap Bjp, Ap, Chandrababu, Janasena, Janasenabjp, Pawan Kalyan, Pura

ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ ఏ మాత్రం బలంగా లేదు.అందువల్ల పార్టీ బలోపేతం కోసం తరచూ ఇతర పార్టీల పొత్తున చేరాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో సొంత బలం కోసం పురందేశ్వరి ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది అనేది ఆసక్తికరమైన అంశం.అలాగే పొత్తుల విషయంలో కూడా బీజేపీ తర్జన భర్జనలో ఉంది.

ప్రస్తుతం జనసేనతో ( Janasena ) పొత్తులో ఉన్నప్పటికి ఆ దోస్తీ నామమాత్రంగానే కనిపిస్తోంది.ఇటు టిడిపితో కలవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇతర పార్టీల పొత్తు వ్యవహారంలో పురందేశ్వరి ఏం చేయబోతుందనేది ప్రశ్నార్థకం.

ఇక జనసేనతో దోస్తీ ఉన్నప్పటికి ఇంతవరకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టలేదు.

Telugu Apbjp, Ap Bjp, Ap, Chandrababu, Janasena, Janasenabjp, Pawan Kalyan, Pura

ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం జనసేనతో కలిసి ముందడుగు వేయడంలో పురందేశ్వరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడాలి.ఇక గత అధ్యక్షుడు సోము వీర్రాజు పై ( Somu Veerraju ) సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు గట్టిగానే రేకెత్తాయి.దాంతో చాలమంది బీజేపీ నేతలు పార్టీ వ్యవహారాలలో అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు.

ఇప్పుడు వారందరిని ఒకే తాటిపైకి తెచ్చేందుకు పురందేశ్వరి ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో మరి.టీడీపీ పై ఘాటైన విమర్శలు కురిపించడంలో పురందేశ్వరి తన మార్క్ చూపిస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు విషయంలో ఆమె ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిరేపుతున్న మరో ప్రశ్న.మొత్తానికి ఏపీలో బీజేపీని బలపరడంలో పురందేశ్వరి ముందు చాలానే సవాళ్ళు ఉన్నాయి.

మరి వాటన్నిటిని ఆమె ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube