ముఖ్యంగా చెప్పాలంటే ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి మేలని దాదాపు చాలా మందికి తెలుసు.అలాగే ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు( Health problems ) దూరమవుతాయి.అందుకే వైద్యులు రోజు ఏదో ఒక ఆకుకూరలు డైట్ లో చేర్చుకోమని సలహా సలహా ఇస్తూ ఉంటారు.
ఇక పొన్నగంటి కూరలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ కూర మగవారికి అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొన్నగంటి ఆకు( Ponnaganti leaf )లో ఆరోగ్యానికి మేలు చేసే ఏ, బి, సి విటమిన్లు, పోలేట్, రైబోఫ్లెవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity )పెరుగుతుంది.పొన్నగంటి ఆకు గుండె, మెదడుకు బలాన్ని చేకూరుస్తుంది.ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది.ఈ ఆకుతో బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్టవం వంటి ఉపయోగాలు ఉన్నాయి.
కందిపప్పు, నెయ్యతో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు.

అలాగే ఈ ఆకును ఉడికించి ఉప్పు, మిర్యాల పొడి( Pepper powder ) కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.కంటి కలకలు, కురుపులతో బాధపడే వాళ్ళు తాజా ఆకుల్ని కళ్ళకింద కాసేపు పెట్టుకుంటే నొప్పి దూరమవుతుంది.నరాలలో నొప్పికి, ముఖ్యంగా వెన్నునొప్పి( Backpain )కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ ఆకు కూరను తింటే మగవారికి కావాల్సిన శక్తి అందుతుంది.అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
పొన్నగంటి కూర జీవక్రియల లోపాలను దూరం చేస్తుంది.టేబుల్ స్పూన్ తాజా ఆకుల రసం వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.