ఇటీవలే జరిగిన ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్ కు చిన్న వయసులోనే భారత జట్టులో స్థానం దక్కింది.తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్( Yashasvi Jaiswal ) ఓపెనర్ గా బరిలోకి దిగాడు.
అయితే భారత జట్టులో స్థానం దక్కితే మిడిల్ ఆర్డర్ లేదంటే చివర్లో బ్యాటింగ్ ఇస్తారనుకుంటే ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగిన జైస్వాల్ చేతికి వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.ఓపెనర్ గా దిగిన జైస్వాల్ మొదటి ఆరు బంతులకు ఒక్క పరుగు కూడా చేయలేదు.
దీంతో కాస్త టెన్షన్ గా అనిపించినా ఆ తరువాత ఫుల్ ఫామ్ కొనసాగించి 73 బంతుల్లో ఆరు ఫోన్లు బాది 40 పరుగులు చేసి, నాట్ అవుట్ గా నిలిచాడు.జైస్వాల్ తో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా టెస్ట్ కెరీర్ ఆరంభించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 64.5 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.ఆ తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు 23 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసి తొలిరోజు ఆటను ముగించింది.యశస్వి జైస్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో( Rohit sharma ) నాట్ అవుట్ గా నిలిచారు.
యశస్వి జైస్వాల్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.

ఆ ఇష్టంతోనే ముంబై( Mumbai) నగరానికి వచ్చాడు.అయితే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉన్నా కూడా యశస్వి జైస్వాల్ మాత్రం తన పట్టుదలతో క్రికెట్లో రాణించే ప్రయత్నాలు చేశాడు.తన తండ్రి పానీ పూరి వ్యాపారంలో అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఎన్నో అవమానలను భరించాడు.
పదేళ్లపాటు దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్ లో తన ప్రతిభను అందరికీ చూపిస్తూ, ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.మొదటిసారి చేతికి వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
జైస్వాల్ కసి చూస్తుంటే భారత జట్టులో శాశ్వత చోటు సంపాదించుకోవడం కోసం ఎంతో పట్టుదలతో ఉన్నాడు అనిపిస్తుంది.ప్రతిభ ఉంటే అన్ని దారులు తెరుచుకుంటాయి అనడానికి యశస్వి జైస్వాల్ కు భారత జట్టులో చోటు దక్కడమే నిదర్శనం.







