Thailand Coconut : వామ్మో.. ఒక్క కొబ్బరిబొండా రేటు రూ.592..

సాధారణంగా కొబ్బరి బొండంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.అంతేకాదు ధర తక్కువ కూడా.

 Thailand Coconut Priced More Than Rs. 500,coconut,thailand Coconut,reddit Coconu-TeluguStop.com

దాంతో చాలా మంది సీజన్ తో పని లేకుండా అందరూ తాగుతారు.అయితే మాములుగా ఈ బొండం ధర ఎంత ఉంటుంది .రూ.50 ఉంటుంది.లేదా రూ.100 ఉంటుంది.అదే సూపర్ మార్కెట్ లో వీటి ధర రూ.100 లేదా రూ.130 వుంటుంది.అదే వాటికి స్ట్రా పెట్టి ప్యాక్ చేసి ఇస్తే మాత్రం రూ.500 పలుకుతుంది.అంత రేటు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది థాయిలాండ్ బోండం. అక్కడ కొన్ని సంస్థలు.బోండాలకు ఇలా గ్రీన్ తొక్కను తొలగించి.ప్లాస్టిక్ పోర్ట్, స్ట్రా పెట్టి.

ప్యాక్ చేసి అమ్ముతున్నాయి.రెడీ టు డ్రింక్ అని చెబుతున్నాయి.

బోండం కొనుక్కున్న వారు.సీల్ తీసి తాగేయడమే అని ఊరిస్తున్నాయి.

కానీ వాటి ధర మాత్రం ఆకాశంలో ఉంటోంది.ఈ బోండాలను మనం ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.

నాలుగు బోండాలను ఒక ప్యాక్‌ కింద అమ్ముతున్నారు.నాలుగింటి ధర $28.99.అంటే మన రూపాయిల్లో.రూ.2371.అంటే ఒక్క బోండం ధర రూ.592 పడుతోంది.

Telugu Coconut, Ready Coconuts, Redditcoconut-General-Telugu

దీనికి సంబందించిన ఫొటోను రెడ్డిట్ యూజర్ నవంబర్ 26న పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది.ఇవేమీ ప్రత్యేకమైన బోండాలు కావు.సాధారణమైనవే.కాకపోతే వీటిని ఆర్గానిక్ బోండాలు అని అమ్ముతున్నారు.ఆ మాటకొస్తే.మన ఊళ్లలో అమ్మేవి కూడా అవే బోండాలే.

ఆసియా దేశాల్లో పండిన పండ్లను అధిక ధరకు అమ్ముకోగలుగుతున్నారు అక్కడి రైతులు.ఆ విధంగా వారికి ప్రభుత్వాలు తగిన ట్రైనింగ్, మెళకువలు నేర్పుతున్నాయి.

వ్యవసాయాన్ని వ్యాపారంలా ఎలా చేయ్యాలో నేర్పుతున్నాయి.మన దేశంలో రైతులు పరిస్థితి మరోలా ఉంది.

మరి మనొల్ల కిస్మత్ ఎప్పుడు మారుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube