టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” అనే చిత్రంలో చిట్టి తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ నటి పూర్ణిమ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి పూర్ణిమ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే అలరించి తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకుంది.
అయితే నటి పూర్ణిమ సినిమా పరిశ్రమలో పని చేసేటప్పుడు క్రమశిక్షణ మరియు సమయ నిబంధనలు క్రమం తప్పకుండా పాటించేది.అందువల్లే తాను నటించిన సినిమాల దర్శక నిర్మాతలు తనను ఎంతగానో ఇష్టపడే వారిని ఆ మధ్య నటి పూర్ణిమ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
అలాగే తనకి ప్రేమించడానికి సమయం దొరకలేదని కానీ తనని ప్రేమిస్తున్నానని అంటూ చాలా ప్రేమ లేఖలు వచ్చాయని చెప్పుకొచ్చింది.తాను మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండడం వల్ల ప్రేమించడానికి పెద్దగా సమయం దొరకలేదని అంతేగాక తనకు ప్రేమ మీద నమ్మకం లేదని అందువల్లనే ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
అయితే వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమలో దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేశానని అందువల్లనే తన పెళ్లయిన కొంతకాలం తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.ప్రస్తుతం తన భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి పూర్ణిమ తెలుగు తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషలలో దాదాపు 100 చిత్రాలలో పైగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.