ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.చక్కెర ఆహారాలు నూనెలో వేయించిన ఆహారాలు అధికంగా తీసుకోవడం, మద్యపానం, ఒత్తిడి, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, గంటలు తరబడి కూర్చుని ఉండటం, వేళకు ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొప్పు పేరుకు పోతుంది.
కొవ్వు పేరుకుపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు అదుపు తప్పడం, గుండెపోటు తదితర సమస్యలన్నీ చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి.
అందుకే పొట్ట కొవ్వును కరిగించుకొనేందుకు నానా తంటాలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ డ్రింక్ ను డైలీ డైట్ లో చేర్చుకుంటే నెల రోజుల్లో పొట్ట కొవ్వు మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పొట్ట కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులో నానపెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి.అలాగే అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి.అనంతరం రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె, ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై ఈ డ్రింక్ ను సేవించాలి.ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట నెల రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.
పైగా ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.దీంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.