అద్భుతమైన రాబడి అందించే టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

బేసిగ్గా ఇక్కడ రెండు రకాల పెట్టుబడిదారులు ( Investors ) ఉంటారు.ఓ వర్గంవారు మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్‌ను( Stock Market ) ఎంచుకుంటే, ఆ రెండవ వర్గం వారు ఎలాంటి రిస్క్ లేని డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు.

 Top Mutual Funds Which Gives You Maximum Returns Details, Mutual Fund,best Incom-TeluguStop.com

అయితే ఇలాంటి ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో రాబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది.అందుకే స్టాక్స్‌లో రిస్క్ తీసుకోలేని వారు అధిక రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్‌( Mutual Funds ) ఎంచుకోవచ్చు.

ఇవి కూడా మార్కెట్‌ రిస్క్‌కు ఎంతో కొంత ప్రభావితం అయితే అవుతాయి కానీ మరీ ఎక్స్‌ట్రీమ్ వోలటాలిటీ ఉండదు.

Telugu Axis Small Cap, Source, Returns, Latest, Motilal Oswal, Mutual, Sbi Cap-G

ఇక దీర్ఘకాలంలో మంచి రాబడి కోసం ఇన్వెస్టర్లు కొన్ని ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.మొదటగా ఇన్వెస్టర్లు మ్యాగ్జిమం రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్‌నే పెట్టుబడికి ఎంచుకోవాలి.అందుకే బుల్లిష్, బేరిష్ పీరియడ్స్‌లో మంచి రాబడిని అందించే కన్సిస్టెంట్ ఫండ్‌ను ఇన్వెస్టర్స్ ఎంచుకోవాలని ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్స్ సూచిస్తున్నారు.

ఈ లిస్ట్‌లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉన్నాయి.

Telugu Axis Small Cap, Source, Returns, Latest, Motilal Oswal, Mutual, Sbi Cap-G

అదేవిధంగా, యస్బిఐ లార్జ్ క్యాప్ ఫండ్, యస్బిఐ మిడ్ క్యాప్ ఫండ్, హెచ్ డి ఎఫ్ సి లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్ డి ఎఫ్ సి మిడ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేవి మంచి ఆప్షన్ అని నిపుణుల మాట.ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు 6.36 కోట్ల SIP అకౌంట్స్ ఉన్నట్టు భోగట్టా.వాటి ద్వారా పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నారు.స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్స్, వాల్యూ ఫండ్స్, మల్టీ-క్యాప్ ఫండ్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, ఈక్విటీ ఫండ్స్ తమ అసెట్స్‌లో కనీసం 65% స్టాక్స్ లేదా బిజినెస్‌లో పెట్టుబడి పెడతాయి.

ఇవే దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించగలవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube