1.ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ ధర్నా
ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది.విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు.
2.యాదాద్రికి సీఎం కేసీఆర్
ఈ నెల 28 వ తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
3.సోనియా పార్టీలో ప్రక్షాళన ప్రారంభించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.
4.మంత్రి కొడాలి నాని కామెంట్స్
ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే వికేంద్రీకరణ అని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా జగన్ ప్రస్తావన రాగా, ఆయనను ఎదుర్కునే దమ్ము ఎవరికీ లేదు అని నాని వ్యాఖ్యానించారు.
5.సిఎస్ సమీర్ శర్మ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు.తన సస్పెన్షన్ ను కొనసాగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని లేఖలో పేర్కొన్నారు.
6.శ్రీశైలం కొత్త పాలకమండలి చైర్మన్ గా చక్రపాణి
శ్రీశైలం కొత్త పాలక మండలి చైర్మన్ గా చక్రపాణి నియమితులయ్యారు.
7.లోకేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు.‘ మధ్య నిషేధం పై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ లోకేష్ అధ్వయంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన చేపట్టారు.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 63, 042 మంది భక్తులు దర్శించుకున్నారు.
9.జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్
ఏపీ సీఎం గా జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు.
10.జగన్ పై లోకేష్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్ చేశారు జగన్ విశాఖ ఎంత తొందరగా వెళ్తే మాకు అంత మంచిదని ఆయన విమర్శించారు.
11.యూపీ సీఎంగా నేడు యోగి ప్రమాణ స్వీకారం
ఉత్తరప్రదేశ్ సీఎం మరోసారి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
12.తెలంగాణకు అన్యాయం : నామా
ఏపీ తెలంగాణ విభజన జరిగిందని నుంచి తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతుందని టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు.
13.ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేయనున్నారు.
14.మళ్లీ భట్టి విక్రమార్క పాదయాత్ర
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మళ్ల మొదలు కాబోతుంది.ఫిబ్రవరి 27 నుంచి ఆయన పాదయాత్ర కొనసాగించనున్నారు.
15.అమలాపురంలో శోభాయాత్ర
నేడు జాతీయ సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా అమలాపురంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.
16.అమరావతి రాజధాని కి బిజెపి కట్టుబడి ఉంది
అమరావతి రాజధాని గా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
17.‘ సలార్ ‘ అప్ డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది.ఏడాది ఏప్రిల్ , కానీ జూన్ లో కానీ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
18.అసెంబ్లీ కాదు జగన్ భజన సభ
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు అసెంబ్లీ జగన్ భజన సభలో మారిందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.
19.జగన్ ప్రకటనపై అమరావతి జేఏసీ నిరసన
మూడు రాజధానులు పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,590
.