యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావి తండాలో గత 15 రోజులుగా నీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…వెంకంబావి తండా గ్రామ పంచాయతీలో నీటి సరఫరా లేక ఇబ్బంది పెడుతున్న విషయం గ్రామ సెక్రెటరీ,స్పెషల్ ఆఫీసర్లతో విన్నవించుకున్నా పట్టించుకోలేదు.
దీనితో గిరిజనులు శుక్రవారం ఆందోళన చేపట్టి,నీటి సమస్యపై ఎంపీడీఓకి వినతిపత్రాన్ని కూడా అందజేశారు.గ్రామంలో నీటి సమస్య ఉందని స్పెషల్ ఆఫీసర్ తో చెపితే నాకేం సంబంధమని దురుసుగా ప్రవర్తించాడని ఎంపీడీఓకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తండాలో నీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోతుతున్నారు.