అజింక్య రహానే రీఎంట్రీ పై ప్రశంసల వెల్లువ.. జట్టుకు ఆపద్బాంధవుడిగా..!

ప్రస్తుతం అజింక్య రహానే( Ajinkya Rahane ) పేరు ప్రశంసలతో మారుమోగుతోంది.క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 Ajinkya Rahane Re Entry Was Praised Details, Ajinkya Rahane,ajinkya Rahane Re En-TeluguStop.com

భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాంధవుడు అయ్యాడు.భారత్ ఓటమి దిశగా సాగుతున్న సమయాలలో మ్యాచ్ ను కీలక మలుపు తిప్పి విజయాలను అందించాడు.

అజింక్య రహానే అన్ని ఫార్మాట్లలో ఎన్నోసార్లు అద్భుత ఆటను ప్రదర్శించాడు.అయితే ఏ ఒక్క ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు బ్యాడ్ ఫేజ్ అనేది ఉంటుంది.

అజింక్య రహానే కు కూడా రెండేళ్ల క్రితం సౌత్ ఆఫ్రికా – భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఇబ్బందులు ఎదురు అయ్యాయి.ఈ సిరీస్లో ఘోరంగా విఫలం అయ్యి చివరికి భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.

భారత జట్టులో చోటు కోల్పోయిన బాధపడకుండా మళ్లీ ఖచ్చితంగా భారత జట్టులో తనకు స్థానం పదిలం అవుతుందని భావించాడు.అందుకోసం దేశవాళి క్రికెట్ అయినా రంజీ ట్రోఫీ లాంటి టోర్నీలలో పాల్గొని సెంచరీలు చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు.

Telugu Ajinkya Rahane, Ajinkyarahane, Latest Telugu, Mahendrasingh, Wtc Final-Sp

చివరికి ఐపీఎల్ 2023లో( IPL2023 ) కూడా రహానే ను వేలంలో కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.అయితే అనుకోకుండా చెన్నై ఫ్రాంచైజీ 50 లక్షలు వేచించి రహానే ను కొనుగోలు చేసింది.ఇందుకు ప్రధాన కారణం మహేంద్రసింగ్ ధోని.కేవలం ఒక్క ధోని కు మాత్రమే రహానే పై నమ్మకం ఉంది.

ఎన్నో రోజులు వేచి చూశాక ఒక అవకాశం వస్తే ఎలా సద్వినియోగం చేసుకోవాలో అజింక్య రహానే ను చూస్తే అర్థమవుతుంది.ఐపీఎల్ లో 14 మ్యాచులు ఆడిన రహానే 172.49 స్ట్రైక్ రేట్ తో 326 పరుగులు చేశాడు.దీంతో బీసీసీఐ సెలెక్టర్ల( BCCI selectors ) దృష్టి రహనేపై పడింది.

Telugu Ajinkya Rahane, Ajinkyarahane, Latest Telugu, Mahendrasingh, Wtc Final-Sp

ఇక డబ్ల్యూటీసి ఫైనల్( WTC Final match ) జట్టులో చోటు దక్కింది.తొలి ఇన్నింగ్స్ లో 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 89 పరుగులు చేసి భారత జట్టుకు అండగా నిలిచాడు.చేతికి వచ్చిన అవకాశాలను చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని ప్రస్తుతం అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube