బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.బీచ్ ఒడ్డున ఆడుకోవడం అంటే చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి దాకా అందరూ ఇష్టపడుతుంటారు.
అందుకే టూర్ అనే వాటిల్లో బీచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది.బీచ్ ఒడ్డున చల్లగాలికి హాయిగా ఎంజాయ్ చేయడం అంటే ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు.
అయితే ఈ బీచ్ ఒడ్డున కూడా అప్పుడప్పుడు వింత విచిత్రాలు కూడా జరుగుతుంటాయి.ఇక వింత లేదంటే విచిత్రం అనగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం కామన్ అయిపోయిందతి.
ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒకటి వైరల్ అవుతోంది.
కాలం మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో రకాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
చాలా రకాలట్రెండింగ్స్ అనేవి తెరమీదకు వచ్చాయి.వీటిల్లో ఈ మధ్య ప్రాంక్ వీడియోలు అయితే బాగా పాపులర్ అయిపోతున్నాయి.
కొన్ని కొన్ని సార్లు ఇవి ఎంజాయ్ మెంట్ ఇస్తున్నా మరికొన్ని సార్లు మాత్రం చిరాకు తెప్పిస్తుంటాయి.ఇంకొన్ని సార్లు ప్రమాదాల్లో కూడా పడేస్తుంటాయి.
అయితే ఇప్పుడు మాత్రం ప్రాంక్ వీడియో చేయకపోయినా కూడా ప్రకృతి చేసిన పనికి అది ప్రాంక్ వీడియోలాగా మారిపోయింది.న్యూయారీ బీచ్ లో రీసెంట్ గా ఓ ఘటన చోటు చేసుకుంది.

అ బీచ్‌లో పర్యాటకులకు రాగా వారందరికీ సడెన్ గా సముద్రంలో వింత ఆకారాలు దర్శనం ఇచ్చేశాయి.ఇంకేముంది వాటిని చూసి దెయ్యాలు అనుకుని వారంతా భయంతో పరుగులు తీశారు.వీటి పనేంతో తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగి విచారించగా అసలు విషయం తెలిసింది.ఆ వింత ఆకారాలు పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు సంబంధించినటువంటి చెక్కలుగా ఆ అధికారులు తేల్చారు.
ఇవి ఎప్పటి నుంచో సముద్రంలో ఉండటంతో ఇలా వాటికి నాచు పేరుకుపోయి వింత ఆకారాలుగా కనిపిస్తున్నాయని వారు చెప్పారు.ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
.