చేతులు నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఒక్క వాష్ లోనే వైట్ గా బ్రైట్ గా మార్చుకోండిలా!

సాధారణంగా కొంద‌రికి శ‌రీరంతో పోలిస్తే చేతులు( Hands ) చాలా నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఎండల ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

 Home Remedy For Whitening Dark Hands!, Dark Hands, Latest News, Skin Care, Skin-TeluguStop.com

అలాగే డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) పేరుకుపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ వంటి కారణాల వల్ల కూడా చేతులు నల్లగా మారుతుంటాయి.దీంతో తెగ హైరానా పడిపోతూ ఉంటారు.

చేతులను మళ్లీ తెల్లగా ఎలా మార్చుకోవాలో అర్థంగాక సతమతం అయిపోతారు.అయితే టెన్షన్ ఎందుకు.

పరిష్కారం లేని సమస్య ఉండదు.

Telugu Tips, Dark, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

నల్లగా మారి కాంతి హీనంగా కనిపిస్తున్న చేతులను ఒక్క వాష్ లోనే వైట్ గా, బ్రైట్ గా( Hands White and Bright ) మార్చే మ్యాజికల్ రెమెడీ ఒకటి ఉంది.మరి ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక టమాటో ని తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి.

ఒక టమాటో ముక్కపై( Tomato ) తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి చేతులకు అప్లై చేసుకుంటూ బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.దాదాపు ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై చేతులు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Dark, Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చేతుల‌ను క్లీన్ చేసుకుని.మంచి మాయిశ్చరైజర్( Moisturizer ) ను అప్లై చేసుకోవాలి.ఈ రెమెడీ తో ఆల్మోస్ట్ ఒక్క వాష్ లోనే మీ చేతుల నలుపు చాలా వరకు పోతుంది.ఇంకా కనుక ఉంటే మూడు నాలుగు సార్లు ఈ రెమెడీని పాటించండి.

దాంతో మీ చేతులు సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరుస్తాయి.అందంగా మ‌ర‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube