ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏడు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు సోదాలు చేపట్టారు.హర్యానా, కర్ణాటకలోని రామచంద్రభారతి నివాసాలలో తనిఖీలు చేస్తున్నారు.
తిరుపతిలోని సింహయాజీ స్వామిజీకి చెందిన ఆశ్రమంలో, హైదరాబాద్ లో నందకుమార్ ఇల్లు, హోటల్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా కేరళలోని కొచ్చిలో ఓ వైద్యుని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఈ వైద్యుడు రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.ఈ తనిఖీలలో పలు కీలక పత్రాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో ఇంకా ట్విస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.