ఒత్తైన మ‌రియు పొడ‌వాటి జుట్టు కావాలా? అయితే ఇది మీ డైట్‌లో ఉండాల్సిందే!

ఒత్తైన మరియు పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఖరీదైన షాంపూ, ఆయిల్స్ వాడుతుంటారు.

 Hair Grows Thicker And Longer If This Juice Is Included In The Diet! Amla Curry-TeluguStop.com

తరచూ హెయిర్ ప్యాక్‌లు, మాస్కులు వేసుకుంటారు.అయితే ఒత్తైన మరియు పొడవాటి జుట్టు కావాలంటే పైపై పూతలే కాదు డైట్ లో పోషకాహారాన్ని కూడా చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీ డైట్ లో కనుక ఉంటే మీ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా మూడు ఉసిరి కాయల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలు, ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పింక్‌ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే ఉసిరి కరివేపాకు జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్ చక్కటి రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌కాల‌ను కలిగి ఉంటుంది.ముఖ్యంగా కురుల సంరక్షణకు ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Amla, Amla Curry, Curry, Care, Care Tips, Fall, Long, Thick-Telugu Health

వారంలో కనీసం మూడు సార్లు ఈ జ్యూస్ ను తీసుకుంటే కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ అదుపులోకి వస్తుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు క్రమంగా త‌గ్గు ముఖం పడతాయి.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube