కొందరి వాట్సాప్ ఖాతా బ్లాక్ అవ్వడానికి కారణం ఏంటంటే..?

ఇప్పుడ ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌ లో ఎక్కువగా కనిపించే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ మెసేజింగ్ యాప్ అని అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి.

ఈ క్రమంలోనే వాట్సాప్ కూడా వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అసాంఘీక కార్యక్రమాలకు, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న 20 లక్షల మంది అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్టు వాట్సప్ పేర్కొంది.

అసలు వాట్సప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తారు.ఎటువంటి కార్యకలాపాలు చేస్తే బ్యాన్ చేస్తారో అనే విషయాలను తెలుసుకుని మీరు కూడా ముందు జాగ్రత్తలు పాటించండి.

మీరు మీ ఫోన్ లో వాట్సాప్‌ కు బదులుగా ఇతర క్లోనింగ్‌ యాప్స్‌ అయిన జీబీ వాట్సాప్‌, వాట్సాప్‌ ప్లస్‌, వాట్సాప్‌ మోడ్‌ యాప్‌ లను కనుక ఉపయీగిస్తున్నట్లయితే వారి ఖాతాలను వాట్సాప్‌ తొలగిస్తుంది.ఎందుకంటే వాట్సప్‌ లాంటి ఇతర యాప్‌ లను వాడితే థర్డ్‌పార్టీ యాప్స్‌ తో యూజర్ల భద్రతకు హాని కలుగుతుంది.

అందుకే అటువంటి వారి అకౌంట్లను బ్లాక్ చేస్తారు.అలాగే మీకు తెలియని నంబర్లకు వారు అనుమతి లేకుండా మెసేజ్‌ లను పంపినట్లయితే వారు మీరు పంపినా మెసేజ్‌ లను స్పామ్‌ గా గుర్తించి వాట్సాప్‌ కు రిపోర్ట్‌ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్ చేస్తారు.

Advertisement

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం వరకు అకౌంట్స్ మన ఇండియాకు చెందిన అకౌంట్లే ఉండడం గమనించాలిసిన విషయం అనే చెప్పాలి.అలాగే వాట్సాప్ యాన్యువల్ అప్‌గ్రేడ్ పాలసీలో భాగంగా మరొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

వచ్చే నవంబర్ నెల నుంచి స్మార్ట్‌ఫోన్‌ ల యూజర్లు వాట్సాప్ వాడేందుకు కొత్త డివైజ్‌ కు అప్ గ్రేడ్ చేసుకోవాలిసి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు