విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్‌ చర్చలు

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల ఎప్పుడో మొదలు పెట్టిన లైగర్ సినిమా అలాగే నిలిచి పోయింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను చేసేందుకు గాను రౌడీ స్టార్‌ జుట్టు పెంచుకున్నాడు.

 Vijay Deverakonda New Movie Starts Very Soon, Vijay Deverakonda, Vijay Deverakon-TeluguStop.com

లైగర్‌ ఆలస్యం అవుతున్నా కూడా జుట్టు వల్ల మరే సినిమాను చేసేందుక లేకుండా పోయింది.దాంతో లైగర్ సినిమా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాను ఈయన మొదలు పెట్టక పోవచ్చు అనుకుంటూ ఉన్న సమయంలో ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ లైగర్‌ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంటుంది.మైత్రి వారు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు.

సంవత్సరం క్రితం ఈ సినిమాను ప్రకటించారు.కాని మొదలు అయ్యిందే లేదు.

Telugu Liger, Puri Jaganadh, Puri Jagannadh, Shiva Nirvana, Tuck Jagadish-Movie

లైగర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేశాడు.కాని ఇప్పటి వరకు లైగర్ ను ముగించలేదు.విజయ్‌ దేవరకొండ ఇప్పటికే చాలా సమయం వృదా చేశాడు. పూరి జగన్నాద్‌ తన డేట్లను వృదా చేస్తున్నాడు అంటూ స్వయంగా విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.

అందుకే లైగర్ పూర్తి కాకుండానే తదుపరి సినిమాను పట్టాలెక్కించే నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్‌ సినిమా ను అక్టోబర్ వరకు పూర్తి చేయనున్నారు.

అంతకు ముందే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారట.శివ నిర్వాన తెరకెక్కించిన టక్‌ జగదీష్‌ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.ఆ తర్వాత శివ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube