నిద్ర.మన ఆరోగ్యానికి కావాల్సిన అత్యవసరమైన వనరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆహారం లేకపోయినా కొద్ది రోజులు జీవించవచ్చు.కానీ, నిద్ర లేకుంటే మాత్రం చాలా కష్టం.అలాగే కంటి నిండా నిద్ర ఉంటే.తొంబై శాతం జబ్బులు దరి చేరవని ఎన్నో అధ్యాయనాల్లో తేలింది.
అందుకే రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవాలని వైద్య నిపుణులు నొక్కి మరీ చెబుతుంటారు.అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పగలంతా అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు.
కానీ, కొందరికి నిద్ర పడుతుంది.అయితే కాసేపటికే మెలకువ వచ్చేస్తుంది.ఇక అంతే సంగతులు.ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు.
ఒకవేళ పట్టినా.మళ్లీ మెలకువ వచ్చేస్తుంటుంది.
ఇలా ఆటంకాలు ఎదురవడం వల్ల ప్రశాంతగా నిద్రపోలేక తీవ్రంగా సతమతం అవుతుంటారు.పైగా ఉదయానికి ఎక్కడ్లేని నీరసం, అలసట వచ్చేస్తుంటాయి.
మీకు కూడా నిద్రలో ఆటంకాలు ఎదురవుతున్నాయా.? అయితే ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి.
నిద్రలో పదే పదే ఆటంకాలు రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

అందుకోసం ప్రతి రోజు యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.అలాగే కొందరు డైటింగ్ పేరుతో నైట్ ఏమీ తినకుండానే పడుకుంటారు.ఇలా చేయడం వల్ల నిద్రలో తరచూ డిస్టబెన్సెస్ ఏర్పడతాయి.అందుకే నైట్ ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు.
పగటి పూట నిద్రపోయినా.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు.
మీకు ఒకవేల పగటి పూట నిద్రపోయే అలవాటు ఉంటే.దాన్ని స్కిప్ చేయండి.
ఇక నైట్ నిద్రించే ముందు హారర్ సినిమాలు చూడటం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉంటే వదులుకోండి.బెడ్ రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోండి.
రూమ్‌లో తక్కువ లైటింగ్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి.తద్వారా నిద్రలో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి.