ఈ నెల 31 న చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.ఆ రోజున ఏ పనులు చేయవచ్చు… ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.
ఈ చంద్ర గ్రహణం జనవరి 31 వతేదీ 2018 న సాయంత్రం 5 గంటల 18 నిమషాలకు ప్రారంభం అయ్యి రాత్రి 8 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది.కర్కాటక రాశి లో చంద్ర గ్రహణం ఏర్పడటం వలన కొన్ని రాశుల వారికీ మంచిది కాదని పండితులు అంటున్నారు.
ముఖ్యంగా పుష్యమి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు ఈ గ్రహాన్ని అస్సలు చూడకూడదు.ఒకవేళ పొరపాటున చూస్తే గోమాతకు బెల్లం తినిపించడం మరియు పేదలకు అన్నదానం చేస్తే ఆ దోషం పోతుందని పండితులు అంటున్నారు.
పొర్ణమి రోజు వచ్చే చంద్ర గ్రహణం రోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఎందుకంటే ఆ సమయంలో వీచే గాలిలో విష పదార్ధాలు ఉంటాయి.అందువల్ల చంద్ర గ్రహణానికి ముందు 3 గంటలు తర్వాత మూడు గంటలు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.గ్రహణ సమయంలో ఖాళీ కడుపుతో ఉంటే మంచిది.
ఒకవేళ గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ సమయంలో కదలకుండా ఉంటే మంచిది.గ్రహణ సమయంలో ఏమి చేసిన ఆ ఫలితం వంద రేట్లు అధికంగా ఉంటుంది.అందువల్ల ఆ సమయంలో దైవ చింతనలో ఉంటే మంచిది.
అంతేకాక గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు.గ్రహణ సమయంలో ఇంటిలో మరియు పప్పు దినుసులు, ఆహార పదార్ధాల మీద గరికను వేస్తె విషపూరితం కావు.
గ్రహణం పూర్తీ అయ్యాక ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానము చేసి గుడికి వెళ్ళాలి.
చూసారుగా ఫ్రెండ్స గ్రహణం రోజున ఇలాంటి జాగ్రత్తలు తీసుకోని గ్రహణ ప్రభావం మీ మీద పడకుండా జాగ్రత్త పడండి.







