వేదింపులు, విమర్శలు.. ఇలా అయితే సాయం ఎవరు చేస్తారు?

సోనూ సూద్‌ లాక్ డౌన్ సమయంలో కొన్ని వేల మందికి తన సొంత డబ్బు ఖర్చు చేసి సాయం అందించాడు.రోడ్ల మీద పడుకున్న వారు ఇంటికి చేరుతామో లేదో అనే భయంతో ఉన్న సమయంలో దేవుడి లా సోనూ సూద్‌ సొంత బస్సులు, వాహనాలు రైళ్లు విమానాలు ఇలా ఏది సాధ్యం అయితే అందులో వలస కార్మికులను వారి వారి ప్రదేశాలకు పంపించాడు.

 Social Media People Trolls On Who Helping Covid People  ,corona , Ranu Desai , F-TeluguStop.com

అలాంటి సోనూసూద్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో మరింత మందికి సాయం చేసే ఉద్దేశ్యంతో ఆక్సీజన్‌ మరియు ఇతర అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చాడు.అలాంటి సోనూసూద్‌ ను కొందరు ఒక పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఆపాదించే ప్రయత్నం చేశారు.

మరి కొందరు ట్రస్ట్‌ కు వచ్చే డబ్బుల కోసం సోనూసూద్‌ ఈ పని చేస్తున్నాడు అంటూ విమర్శించిన వారు ఉన్నారు.మంచికి పోతే చెడు ఎదురు అయినట్లుగా రేణు దేశాయ్ కూడా మంచి చేద్దామనుకుంటే చెడు ఎదురు అయ్యింది.

రేణు దేశాయ్ ఒక ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి దానికి ఏ సమస్య ఉన్నా కాల్‌ చేయవచ్చు అంటూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది.ఆక్సీజన్ అవసరం ఉన్న వారు కాల్‌ చేస్తే వారికి ఆ ఏరియాలో ఉన్న ఆక్సీజన్ ను అందేలా చేయడంతో పాటు ఇంకా పలు రకాలుగా రేణు దేశాయ్‌ సహకారం అందించారు.

అలాంటి రేణు దేశాయ్ ను కొందరు ఆకతాయిలు ఆర్థిక సాయం కావాలంటూ వేదించడం మొదలు పెట్టారట.మీరు ఆర్థికంగా సాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కొందరు సాయం చేయకుంటే చంపేస్తాం అంటూ కొందరు బెదిరిస్తున్నారట.

దాంతో ఆమె సీరియస్ అయ్యింది.వీరిద్దరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ని కూడా సోషల్‌ మీడియా వేదికగా బెదిరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

సెలబ్రెటీ అయినంత మాత్రాన సాయం చేయాలని ఏమైనా ఉందా.సరే సాయం చేస్తే ఇలా వేదింపులు.

విమర్శలు వస్తే మళ్లీ ఎవరైనా సాయం చేస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube