టీం ఏర్పాటుపై కేసీఆర్ ఫోకస్.. కానీ పూర్తయ్యేది ఎప్పుడు?

తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న పార్టీ ఏదంటే అందరూ టక్కున టీఆర్ఎస్ అని చెబుతారు.వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఈ పార్టీ.

 Kcr Focus On Team Formation  But When Will It Be Completed , Kcr , Trs , Dubbaka-TeluguStop.com

రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా తమకు ఎదురులేదని చాటి చెబుతూ వస్తోంది.కానీ ప్రస్తుతం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.

దీంతో పార్టీ బలహీనపడుతుందని భావించిన సీఎం కేసీఆర్.టీఆర్ఎస్ తో పాటు అందులోని నేతలను సైతం గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు.ఇక 2018 ముందస్తు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీకి జిల్లాల వారీగా అధ్యక్షులను అధిష్ఠానం ఇప్పటి వరకు కూడా నియమించలేదు.దీంతో ఏ విషయంలోనైనా నియోజకవర్గ ఇన్‌చార్జిలే అన్ని దగ్గరుండి సమన్వయం చేసుకుంటున్నారు.దీంతో ఎలాగైనా జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర కమిటీని నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

గతంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది కానీ.ఇంకా సాగుతూనే ఉంది.

ఈ పదవులపైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.మరి వారి ఆశలు నెరవేరతాయో లేదో?

జిల్లా అధ్యక్షులు లేకపోవడంతో ప్రతిపక్షాలు పార్టీపై చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ వెనుకబడుతోంది.దీనిని గమనించి గులాబీ బాస్ ఎలాగైన జిల్లా అధ్యక్షులను నియమించాలని, రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు.

పార్టీలో నామినేటెడ్ పదవులు రాకుండా అసంతృప్తితో ఉన్న వారికి ఈ పదవులు కట్టబెట్టాలని సీఎం యోచిస్తున్నారు.వీటిలో కొందరు సీనియర్లకు సైతం చోటు దక్కే చాన్స్ ఉంది.

మరి ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది.అందులో ఎవరెవరికీ చాన్స్ వస్తుంది అనే విషయాలపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

KCR Focus On Team Formation But When Will It Be Completed , Kcr , Trs , Dubbaka, Huzurabad , Nominated Positions , District President - Telugu @cm_kcr, Dubbaka, Huzurabad

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube