జగన్ తర్వాత పార్టీలో ఆ స్థాయిలో పాపులర్ అయిన వ్యక్తి విజయ సాయి రెడ్డి( Vijayasai Reddy )అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు అరెస్టు అయిన విజయసాయిరెడ్డి దశాబ్దాల నుండి వైయస్ కుటుంబానికి అండగా ఉన్నారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా వ్యవహరిస్తున్నారు… ఆయన కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెట్టే విజయసాయిరెడ్డి కి జగన్ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తారు.
జగన్ పైన గాని ,పార్టీ పైన గాని విమర్శలు చేసే ప్రత్యర్థులపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చెల్లరేగిపోతారు.తెలుగు భాష పై మంచి పట్టు కూడా ఉన్న ఈయన ప్రాసలతో ప్రత్యర్థుల పని పడుతుంటారు.
ముఖ్యంగా చంద్రబాబు పైన లోకేష్( Nara Lokesh ) పైన అయితే మరింత ముందుకు వెళ్లి మరి తన స్థాయి తగ్గించుకొని మరి విమర్శలు చేస్తుంటారు ఇలా వైసిపిలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ సాయి రెడ్డి గత కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు జరిగినా వాటిపై కనీసం స్పందించని ఆయన పార్టీ వ్యవహారాలలో కూడా అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు.గత కొన్ని నెలలుగా పార్టీ మీడియాలో కూడా ఆయనకు అంత ప్రాధాన్యత లభించకపోవడం మనం గమనించవచ్చు అయితే ఉన్నట్టుండి ఆయన మౌనంగా మారడానికి కారణాలు ఏమిటా అని ఆరా తీస్తే ఆసక్తికర సమాధానం వస్తుంది .
తనకు అల్లుడు వరసయ్యే నందమూరి తారకరత్న( Taraka Ratna ) మరణించిన సమయంలో ఆయన హాస్పిటల్ లో ఉన్న సమయంలో అన్నీ తానే దగ్గరుండి చూసుకున్న విజయ్ సాయి రెడ్డి ఆ ఆ తర్వాత జరిగిన దశదిన కర్మలు సమయంలో చంద్రబాబుతో కొంత సాన్నిహిత్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది.తారకరత్నకు ఇద్దరు సమీప బంధువులు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది.ఇది వైసీపీ అధినాయకత్వానికి అంత రుచించలేదని సమాచారం అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న విజయసాయి రెడ్డికి అక్కడి వ్యవహారాల మీద గట్టి పట్టుంది ….విజయ సాయి రెడ్డి అనుమతి లేకుండా అక్కడ అధికారులు ఎమ్మెల్యేలకు కూడా పనిచేసి పెట్టరని అక్కడ పనులు జరగాలంటే విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకోవాలనే టాక్ ఉంది.
దీనిపై చాలామంది కీలక ఎమ్మెల్యేలు జగన్కు ఫిర్యాదు చేశారని అందుకే ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డి తప్పించి తన బాబాయి వై వి సుబ్బారెడ్డి( Y.V.Subba Reddy ) కి కట్ట బెట్టారని ఆ వ్యవహారంతో మనస్థాపానికి గురైన విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి ….ఆయన మౌన o వెనక పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నలు కూడా వినపడినా వైయస్సార్ కుటుంబంతో దశాబ్దాలు అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ మారేంత పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అని తనకు తగ్గిన ప్రాధాన్యత దృష్ట్యా కినుకుతో ఉన్న ఆయన కొంత నిశ్శబ్దంగా ఉన్నారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.