మానవత్వం మరిచిన మనుష్యులు సాటి వ్యక్తి ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ ఉన్నారు.కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకుని సాయం కోసం అతడు పెట్టిన కేకలకు కూడా వారు స్పందించలేదు.
దీంతో ఒక నిండు ప్రాణం అగ్నికి ఆహుతయ్యింది.ఈ ఘటన రాజస్థాన్‌లోని కోట-ఉదయ్‌పూర్ రహదారిపై ధక్కడ్‌ఖేడ్ గ్రామ సమీపంలో ప్రేమ్‌చంద్‌జైన్(53) అనే వ్యాపారి కారు హఠాత్తుగా ఆగిపోయింది.
ఈ క్రమంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పనిచేయలేదు.
ప్రేమ్‌చంద్‌జైన్ సాయం కోసం కేకలు వేశాడు.కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతడి అరుపులు పట్టించుకోకుండా మంటల్లో ఉన్న కారును తమ సెల్‌ఫోన్లలో షూట్ చేస్తూ ఉండిపోయారు.
ఈ ప్రమాదంలో ప్రేమ్‌చంద్ జైన్ కారులోనే మృతిచెందాడు.
పోలీసులు వచ్చి అతడి మృతదేహం కోసం చూడగా కారులో కేవలం అతడి అస్థిపంజరం మాత్రమే మిగిలింది.
స్థానికులు స్పందించి కారు అద్దాలు పగలగొట్టి ఉంటే ఆయన బతికేవారని పోలీసులు తెలిపారు.మానవత్వం మంటగలియడం అనే పదానికి పూర్తి ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది.







