ఈ మధ్యకాలంలో చాలామంది టీని విపరీతంగా ఇష్టపడుతున్నారు.టీలు, కాఫీలు తాగకుండా ఎవరు కూడా ఉదయాన్నే ఏ పని కూడా మొదలుపెట్టరు.
అయితే టీ,కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది.దీంతో టీ, కాఫీ ని ఎక్కువగా తాగడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ టీ తాగితే ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టవచ్చు.అయితే సాధారణంగా మనం అరటిపళ్ళను తింటూ ఉంటాం.
కానీ అరటి పండుతో ఇంకా చాలా రకాలుగా కూడా ఉపయోగాలు ఉన్నాయి.అయితే అరటి టీ ఎలా తయారు చేసుకోవాలో ఎవరికి తెలిసి ఉండదు.

అయితే ప్రస్తుతం దాని గురించి తెలుసుకుందాం.అరటికాయను, అలాగే అరటి పువ్వులను, అరటి ఆకులు, కండలను కూరగాయలుగా వాడుతారు.వీటితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.అలాగే వీటిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి.అయితే అరటిపండులను జీరో కొలెస్ట్రాల్ గా కూడా చెప్పుకుంటారు.ఇందులో ఎన్నో విటమిన్ లు ఉంటాయి.
అందుకే ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.అలాగే అరటితో చేసిన టీ తాగడం వలన బరువు తగ్గడం( Weight Loss ), ఎసిడిటీ, ఉబ్బరంతో బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుంది.
అయితే అలాంటి టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి తయారు చేసుకోవడానికి దాల్చిన చెక్క పొడి, నీరు, అరటికాయ అవసరం ఉంటుంది.ముందుగా అరటిని శుభ్రంగా కడుక్కొని తొక్కతో ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకొని మరిగించి, అందులో అరటిపండును వేయాలి.
అవి మరుగుతూ ఉండగా దాని రంగు మారుతుంది.అప్పుడు రుచి కోసం అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder )ని వేసి కాసేపు అలాగే ఉంచి, ఇక వడగట్టి తీసుకోవాలి.
అయితే పడుకునే ముందు తీసుకోవడం వలన మంచి నిద్ర వస్తుంది.అలాగే ఇందులో మ్యాంగనీస్, పొటాషియం, విటమిన్ బి పుష్కలంగా ఉండడం వలన ఇది శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి.
అందుకే అధికంగా టీ, కాఫీలను తాగడం కంటే అరటి టీ ( Banana tea )తాగడం వలన ఎలాంటి సమస్యలకైన దూరంగా ఉండవచ్చు.