ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని బీజేపీ, నిందితులు పలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగానే బీజేపీ కోరినట్లు సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం అంగీకరించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తును రద్దు చేసిందని న్యాయవాది రాంచందర్ రావు తెలిపారు.
వెంటనే కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించిందని వెల్లడించారు.కాగా ఇప్పటివరకు ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.