టాలీవుడ్ లో స్టార్ నిర్మాత ల జాబితా తీస్తే అందులో దిల్ రాజు( Dil Raju ) ముందు వరస లో ఉంటాడు అనడం లో సందేహం లేదు.స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకి ఎంతో మంది హీరోలతో సినిమాలను నిర్మించిన ఘనత కేవలం దిల్ రాజ్ కి మాత్రమే దక్కింది.
చాలా మంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ఉన్నారు.అందులో అల్లు అరవింద్( Allu Aravind ), సురేష్ బాబు( Suresh Babu )మరి కొందరు నిర్మాణానికి కాస్త దూరంగా ఉంటున్నారు.
పెద్ద సినిమాలు నిర్మించకుండా అరుదుగా మాత్రమే సినిమాల నిర్మిస్తున్నారు.దాంతో దిల్ రాజు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా నిలిచి పోయాడు ఆయన నుండి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దిల్ రాజు ఎంపిక చేసుకున్న సినిమా అంటే మినిమం ఉంటుంది అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు అంటే ఆ స్థాయి ని దిల్ రాజు నిలబెట్టుకున్నాడు అనడంలో సందేహం లేదు.
దిల్ రాజు వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు.పంపిణీ చేస్తున్నాడు, కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆయనకు కమర్షియల్ గా భారీ విషయాలను సొంతం చేసి పెడతాయి.ఒకప్పుడు బొమ్మరిల్లు సినిమా( Bommarillu ) తో దిల్ రాజుకి భారీగా లాభాలు వచ్చాయి.
మళ్లీ ఆ స్థాయి లాభాలు ఇటీవల ఆయన నిర్మించిన బలగం చిత్రం కి వచ్చాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
బలగం సినిమా( Balagam ) రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది.ఇప్పుడు ఆ సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే.భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకున్న బలగం చిత్రం ఏకంగా 100 కోట్ల స్థాయి అనడంలో సందేహం లేదు.
అందుకే బలగం చిత్రం యొక్క వసూళ్లు మరియు ఇతర విషయాల గురించి ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది.టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గతం లో నిర్మించిన బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ ని కమర్షియల్ గా ఈ సినిమా దక్కించుకుంది అంటూ అంతా అనుకుంటున్నారు.