టాలీవుడ్ వుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది జనసేన పార్టీ( Janasena party ) ని స్థాపించిన ఈయన వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారం అందుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒకవైపు సినిమా షూటింగులలో పాల్గొంటూనే మరోవైపు వారాహి యాత్ర ( Varahi Yatra ) కూడా చేపడుతున్నారు.
ఇలా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో ఈయన యాత్రలో పాల్గొనడానికి అలాగే పవన్ సభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు.

ఇక ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటూ మాట్లాడారు.అలాగే తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోల గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడంతో సదరు హీరో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ తనకు ఇష్టమైన హీరోల గురించి తెలియజేశారు మరి పవన్ మూడవ భార్య అన్నా లేజినోవాకు( Anna Lezhneva ) ఏ హీరో అంటే ఇష్టం అన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ భార్యకు ఆ టాలీవుడ్ హీరో హీరో అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ భార్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది.మహేష్ బాబు భార్య నమ్రత(Namrata) పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు.ఈ క్రమంలోనే తనకు మహేష్ బాబు నటన అంటే చాలా ఇష్టం.పవన్ కళ్యాణ్ దంపతులు మహేష్ బాబు దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కానుకలను పంపిస్తూ ఉంటారు.
అలాగే ప్రతి సమ్మర్ లోనూ పవన్ కళ్యాణ్ తన తోటలో కాసిన మామిడి పండ్లను కూడా మహేష్ బాబుకు స్పెషల్ గా పంపిస్తూ ఉంటారు.







