హనీరోజ్( Honey Rose ).ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.
ఈ సినిమా విడుదలకు ముందు విడుదలైన తర్వాత కొద్ది రోజులపాటు సోషల్ మీడియా( Social media )లో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించింది.అయితే హనిరోజ్ 15 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన విధంగా గుర్తింపు దక్కలేదు.
కానీ వీరసింహారెడ్డి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.అలాగే ఈ మధ్యకాలంలో ఈమె పలు రకాల మాల్స్ ని షాపింగ్ లో ఓపెన్ చేయడానికి కూడా వెళ్తోంది.ఇక హనీరోజ్ వస్తుంది అని తెలిస్తే చాలు భారీగా అభిమానులు అక్కడికి తరలి వస్తున్నారు.
కుర్రాళ్ళ కథల రాకుమారిగా రాణిస్తూ దూసుకుపోతోంది.ఇక ఈమె సోషల్ మీడియాలో సృష్టించే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ కి వెళ్లిన హనీరోజ్ ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర‍్నే స్టోన్ ( Blarney stone )ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది.

అందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఇందులో భాగంగా చాలా ఎత్తులో పడుకుని తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది.ఈ ఎక్స్ పీరియెన్స్ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని హనీరోజ్ చెప్పుకొచ్చింది.ఆ వీడియోని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇలాంటి రిస్క్ స్టంట్ లు ఇంకొకసారి చేయకు అంటూ ఆమెకు అడ్వైజ్లు ఇస్తున్నారు.ఈమె అందానికి యూత్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
రోజురోజుకీ అందాన్ని మరింత పెంచుకుంటూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అంతకంతకు పెంచుకుంటూ పోతోంది ఈ బ్యూటీ.







