చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటారు.ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యింది అంటే డైరెక్ట్ చెప్పింది చెప్పినట్టు చేసేయాలి.
అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఏదో ఒక వీక్నెస్ ఖచ్చితంగా ఉంటుంది.అది ఏదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.
మన టాలీవుడ్ లో చాలామంది అలా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు.పేరుకే వీరంతా ఫ్యాన్ ఇండియా హీరోస్ కానీ వారి వీక్నెస్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు.ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోస్ ఏంటి వారు ఏ విషయంలో వీక్ అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభాస్
ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు ప్రభాస్( Prabhas ).ఆయన నటించిన కల్కి సినిమా తాజాగా విడుదలవుతోంది.అయితే ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న ఆయన జనాలు ఎక్కువగా ఉంటే అస్సలు షూటింగ్ లో డైలాగ్స్ గట్టిగా చెప్పలేరట.
అంతేకాదు మైక్ ఇస్తే అస్సలు మాట్లాడలేరు కూడా.చాలా స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ చత్రపతి సినిమా ( Chatrapathi)నుంచి నలుగురిలో డైలాగ్స్ చెప్పడం బాగా తగ్గించారట.అందుకే ఆయన షూటింగ్ జరుగుతున్న టైం లో వీలైనంత తక్కువ మంది స్టాఫ్ ఉండే విధంగా దర్శకులు జాగ్రత్తగా పడతారట.
అల్లు అర్జున్

టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని అడిగితే చాలామంది అల్లు అర్జున్ పేరు తడుముకోకుండా చెబుతారు.ఆయన సినిమాలు ఖచ్చితంగా మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి.అయితే ఒక్కో స్టెప్ ఎంత కష్టమైనా సరే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా కెమెరా ముందు చేయగలిగే అల్లు అర్జున్( Allu Arjun ) ఒకదాని తర్వాత ఒకటి పది స్టెప్స్ చేయాలంటే మాత్రం తన వల్ల కాదట.ఉదాహరణకు నాలుగు నిమిషాల పాటను కంటిన్యూగా ఆయన డాన్స్ చేయలేరట.ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆయన వల్ల కాదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్

ఎంత మంచి యాక్షన్ అయినా ఇలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అయినా కూడా ఇరగదీసే హీరోగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కి మంచి పేరుంది.అయితే ఆయనకు నటనపరంగా వీక్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది రొమాంటిక్ సన్నివేశాలు అని తెలుస్తోంది.ఇలాంటి యాక్షన్ సీనైనా గట్టిగా పర్ఫార్మ్ చేయగలిగే ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ లో మాత్రం తేలిపోతారట.
అందుకే ఆయన సినిమాలో వీలైనంత తక్కువ రోమాన్స్ ఉండేలా చూసుకుంటారట.







