1.దుబాయ్ పర్యటనకు భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

మొదటిసారిగా దుబాయ్ పర్యటన కు వస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వీ రమణ కు స్వాగతం పలికేందుకు ఎన్నారైలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించేందుకు జస్టిస్ రమణ ఈరోజు దుబాయ్ పర్యటన కు వెళ్లారు.
2.ఆంక్షలు తొలగిస్తున్న బ్రిటన్

అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలను తొలగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.శుక్రవారం నుంచి అన్ని రకాల అంశాలను తొలగించనున్నారు.
3.స్పేస్ వాక్ చేసిన తొలి భారత సంతత వ్యక్తి
భారత మూలాలు ఉన్న అమెరికా వ్యామోగామి రామాచారి అత్యంత అరుదైన ఘనత సాధించారు.
స్పేస్ వాక్ చేసిన తొలి భారత సంతతి వ్యక్తి గా రికార్డు సృష్టించారు.రామాచారి తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి.
4.పేరు మార్చుకున్న టెస్లా అధినేత

టెస్లా చీఫ్ ఎలెన్ మాస్క్ తన పేరును మార్చుకున్నారు. Elon Musk అనే పేరులో కొత్తగా A అక్షరాన్ని చేర్చారు.ఆయన కొత్త పేరు ELONA MUSK.
5.చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.జిలిన్ ప్రావిన్స్ లో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో, దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి.
6.నోరు జారిన బైడన్

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పొరపాటున నోరు జారారు.ఓ సమావేశంలో పాల్గొన్న బైడన్ ఉపాధ్యక్షురాలు కమల హరీష్ గురించి ప్రస్తావించిన సందర్భంలో ఈ కార్యక్రమానికి ప్రథమ పౌరురాలు హాజరు కావాల్సి ఉన్నా, ఆమె భర్తకు కరోనా సోకడంతో ఆమె హాజరుకాలేదని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.
7. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఒమి క్రాన్ కేసులు పెరుగుతున్నాయి.దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు జారీ చేసింది.
8.ప్రపంచ కుబేరుల జాబితా
ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ కి పదో స్థానం లభించింది.బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన జాబితాలో ముకేష్ అంబానీకి పదో స్థానం లభించింది.అలాగే 11వ స్థానాన్ని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని దక్కించుకున్నారు.
9.భారత్ కు అమెరికా హెచ్చరిక

రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది అని వస్తున్న వార్తలపై అమెరికా మండిపడింది.రాయితీ ధరకు రష్యా నుండి మూడు చమురు కొనుగోలు చేయడం ద్వారా అమెరికా ఆంక్షలు భారత్ ఉల్లంగించవద్దు అంటూ హెచ్చరించింది.
10.అమెరికా రష్యా ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సహా 12 మంది టాప్ యూఎస్ ప్రతినిధుల పై రష్యా ఆంక్షలు విధించింది.
.