బాలీవుడ్ స్టార్స్ మనసు దోచేస్తున్న న్యూ మోడల్ లగ్జరీ కారు ఏంటో తెలుసా?

సినిమా తారలు అంటేనే లగ్జరీ జీవితానికి కేరాఫ్ అడ్రస్.వారు ఉండే బంగళా.

 Bollywood Heros Passionate About Luxury Cars , Bollywood , Ranveer Singh, Ayushm-TeluguStop.com

తిరిగే కారు, తినే తిండి, వేసుకునే బట్టలు.అన్నీ లగ్జరీగానే ఉండాలి అనుకుంటారు.

చాలా మంది నటీనటులకు లగ్జరీ కార్లంటే చెప్పలేనంత మోజు.హీరోలే కాదు.

హీరోయిన్లకూ ఈ కార్ల పిచ్చి ఉంది.మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వస్తుందంటే చాలా దాన్ని తమ గ్యారీజీలోకి తెచ్చుకోవాలని ఆరాట పడతారు.

అంతేకాదు.నచ్చిన కార్లను విదేశాల నుంచి సైతం తెప్పించుకునేందకు వెనుకాడరు.

తాజాగా బాలీవుడ్ తారల కన్ను మెర్సిడెస్- మైబాహ్ జీఎల్ఎస్-600 కారుపై పడింది.దాన్ని ఎలాగైనా తమ గ్యారేజీలోకి తెచ్చుకోవాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఈ కారును పలువురు బాలీవుడ్ స్టార్స్ వరుస బెట్టి కొనుగోలు చేస్తున్నాడు.ఈ కారును బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ దక్కించుకుంది.బాలీవుడ్ లో మాంచి ఊపు మీదున్న ఈ ముద్దుగుమ్మ మంచి పారితోషకం కూడా తీసుకుంటుంది.తాజాగా ఆమె ఈ కారు కొనుగోల చేయడంతో ఎలైట్ క్ల‌బ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కృతి సనన్ ఒక్కతే కాదు.గత కొంత కాలంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ కారును కొనుగోలు చేశారు.

ర‌ణ్ వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ క‌పూర్ సహా పలువురు ఈ కారును తమ గ్యారేలోకి తెచ్చేసుకున్నారు.

Telugu Arjun Kapoor, Bollywood, Bollywoodheros, Kruthi Sanon, Luxury Suv, Merced

మెర్సిడెస్ ల‌గ్జ‌రియ‌స్ ఎస్యూవీ ఇన్ ద వ‌రల్డ్ గా పేరు పొందింది ఈ కారు.దీని ధర అక్షరాలా2.43 కోట్ల రూపాయ‌లు.ధర మాదిరిగానే ఈ కారులోని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.జర్మన్ కంపెనీ తయారు చేసే ఈ కారుపై బాలీవుడ్ తారలు వీపరీతంగా మనసు పడుతున్నారు.

బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు రిచ్ పీపుల్ కూడా ఈ కారు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.మొత్తానికి మెర్సిడెస్- మైబాహ్ జీఎల్ఎస్-600 కారు ఇండియాలో హట్ కేకులా మారిపోయింది.

తన అందం, అద్భుత ఫీచర్లతో అందరి మనసులు దోచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube