టిడిపి నేత పట్టాభి రామ్ తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లపై దాడిని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఖండించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలకు భద్రత కరువైందని,మరీ ముఖ్యంగా ప్రజలకు భద్రత లేదని ,రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఒక గన్ పెట్టుకొని తిరగాలని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
తమ కార్యకర్తలు అనుకుంటే పట్టాభి రామ్ ఇల్లు ,టిడిపి ఆఫీస్ లు ఇంద్రభవనం లాగా మారుస్తామని ,కానీ ప్రజల ఆస్తులకు ఇబ్బంది కల్పిస్తే ఎలా అని అన్నారు.పట్టాభి రామ్ ఇల్లు ,టిడిపి ఆఫీస్ లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని,రేపు మేము అధికారం లోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని జెసి హెచ్చరించారు.
ఎపి మరో బీహార్ లా మారిందని జెసి అన్నారు.