నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడటానికి ఎందుకు వెళ్ళడు ?

సినిమా ఇండస్ట్రీ లో అందరు మంచి చెడు కలిసే పంచుకుంటారు.ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమం అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు.

 Why Nag Will Not Attend Any Funeral , King Nagarjuna, Mr. Krishna, Akkineni Nage-TeluguStop.com

కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం ఎక్కడ ఎవరు చనిపోయిన కూడా చివరి చూపు చూడడానికి అస్సలు వెళ్లరు.చాల ఏళ్లుగా అయన ఇలాగే వ్యవహరిస్తున్నారు.

కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం అందరు మాట్లాడుతున్నారు.మొన్న ఆ మధ్య కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడం పై మీడియా తో పాటు సోషల్ మీడియా లో కూడా కొంత కామెంట్స్ వినిపించాయి.

అయన కుటుంబం లో మాత్రం అక్కినేని నాగేశ్వర రావు కన్ను మూసినా అయన సతీమణి అన్నపూర్ణమ్మ కన్ను మూసినా చాల మంది వందల్లో, వేళల్లో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది.కానీ నాగార్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా ఆఖరి చూపు కు వెళ్లడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి, పార్టీ లు ఉన్న కూడా నాగార్జున తప్పకుండా షూటింగ్ లేకపోతే హాజరు అవుతారు.కొంత మంది సెలబ్రిటీ ల పెళ్ళికి కుటుంబ సమేతంగా రావడం మనం మీడియాలో కూడా చూసాం.

కొంత లో కొంత నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళింది అంటే, ఒక్క దాసరి ఇంటికి మాత్రమే.దాసరి నారాయణ రావు భార్య పద్మ చనిపోతే ఆ తర్వాత మూడవ రోజు వెళ్లి దాసరి ని కలవడం జరిగింది.అయితే అదే సమయంలో నాగార్జున కి సంబందించిన సినిమా ఒకటి ఆగిపోవడం వల్లనే వెళ్లి కలిసి పనిలో పని గా పరామర్శించాడు.నాగార్జున సంగతి పక్కన పెడితే అయన కుమారులు నాగ చైతన్య మరియు అఖిల్ మాత్రం నాగార్జున వైఖరికి పూర్తి భిన్నం.

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూస్తే చైతు వెళ్లి ఆఖరి చూపు చూసి మహేష్ ని ఓదార్చాడు.అంతకు ముందు కూడా కొంత మంది సెలబ్రిటీస్ కన్ను మూస్తే చైతు పక్కాగా వెళ్లి పలకరించాడు.

అఖిల్ కూడా ఇప్పుడిప్పుడే ఆ వైపు అడుగులు వేస్తున్నాడు.

Why Nagarjuna Not Attends Last Rites

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube