సూర్యాపేట జిల్లా:నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగంఅని అందుకే అందరూ మనస్పూర్తిగా నవ్వుతూ ఉండాలని యోగ గురువు పాపిరెడ్డి అన్నారు.ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట( Suryapet ) ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నవ్వుల దినోత్సవాన్ని( World Laughter Day ) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాఫింగ్ యోగ సేవ క్లబ్ ఏర్పాటు చేసి మమ్ముల్ని ప్రోత్సహిస్తున్న ఖమ్మం నగరానికి చెందిన మరికంటి వెంకట్ కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు,నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయన్నారు.
బాధను తట్టుకునే శక్తిని నవ్వు పెంచుతుందని,దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నవ్వు దివ్య ఔషధంలా, చికిత్సగా పనిచేస్తుందని, జీవితం నవ్వుల బాటలో నడవడం వల్ల సగటున ఏడేళ్ల ఆయుషు పెరుగుతుందన్నారు.దుష్ప్రభావాలను తగ్గించడంతో పాటు రక్త సరఫరా మెరుగుపడానికి, ఉత్సాహాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని మనిషి సంతోషానికి, ఆనందానికి సహజమైన వ్యక్తీకరణ నవ్వు మాత్రమే నని,నవ్వు అంటే కంటికి శాంతి,చూపునకు వరమన చెప్పారు.
భగవంతుడు ఇచ్చిన ఔషధ రసాయనం నవ్వు అని,మన నుంచి వచ్చే చిరునవ్వు ఎదుటివారిని ఆకర్షింప చేస్తుందని,నవ్వును ప్రేమించి,కోపాన్ని ద్వేషించే మనిషికి ఏ రోగాలు దరిచేరవని,దేహమే దేవాలయం,జీవుడే దేవుడని వ్యాఖ్యానించారు.ఎల్లప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా ఉండాలని, అప్పుడే అతడి దేహం ఒక శక్తి కేంద్రంగా మారుతుందన్నారు.
ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది చిరునవ్వు మాత్రమే నని,నవ్వుతూ పదిమందిని నవ్విస్తుంటే ఏ సమస్యలు రావని పెద్దలు చెప్పారని, నవ్వడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని తెలియజేయడమే లాఫింగ్ యోగ క్లబ్ ఇంటర్నేషనల్ ఉత్సవ నిర్వహణ పరమార్థమన్నారు.
ఈ కార్యక్రమంలో భాస్కర చారి,గవి లింగయ్య, సుదర్శన్ రెడ్డి( Sudarshan Reddy ), సుధాకర్,సరళ జయలక్ష్మి,గోరంట్ల శ్రీనివాస్,దేవరశెట్టి రాంబాబు,శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి,మమత, బాణాల శ్రీనివాస్,పి.వెంకటేశ్వర్లు,రమణ తదితరులు పాల్గొన్నారు