అమ్మతనం అనేది అనుభవిస్తే వచ్చేది మాత్రమే.అందుకే ప్రతి అమ్మాయి అమ్మ అవ్వాలి .
కానీ ఇది ఇప్పుడు అంగట్లో కేజీ టమాటా ఎంత అన్నట్టుగా సరోగసి అనే పదం కూడా అంతకన్నా చీప్ గా మార్చేశారు.ఈ మధ్య నయనతార సరోగసి పద్దతిలో తల్లి అయినా తర్వాత ఈ పద్ధతి గురించి మరింత ప్రచారం సాగుతుంది.
అయితే అమ్మ కావాలనుకున్నప్పటికీ కాలేని వాళ్ళు మాత్రమే సరోగసి కి వెళ్లి తమ అండం మరొక తల్లి గర్భం ద్వారా పెంచి 9 నెలలకు బిడ్డ రూపంలో ఇస్తారు.ఇది ఇప్పటికే ప్రపంచం లో చాల మంది చేసారు.
దీనికి కొన్ని చట్టాలు కూడా వచ్చాయి.వీటిపై మారుమూల పల్లెటూరి వారికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటి వరకు సరోగసి కాకుండా అండాన్ని భద్రపరుచుకొని తమకు కావలసినప్పుడు పిల్లలలను కనే పద్ధతి వచ్చింది.ఆరోగ్యవంతమైన అండాన్ని భద్రపరచడానికి కొన్ని బ్యాంక్స్ కూడా వచ్చాయి.ఇక వీర్యాన్ని కూడా ఇప్పటికే చాలా రోజులుగా భద్ర పరుస్తున్నారు.కానీ ఇప్పుడు దానికి మించి మరొక అడ్వాన్సుడ్ పద్ధతి మార్కెట్ లోకి రాబోతుంది అసలు సరోగసి తో సంబంధం లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి లేదా మహిళా అవసరం లేకుండానే 9 నెలల పాటు ల్యాబ్ లో పెంచే పద్ధతి వచ్చిది.

దాని పేరు ఎక్టోలైఫ్. నిజమైన పిండాలను కృత్రిమ గర్భం లో ప్రవేశపెట్టడం అన్నమాట.ఇప్పుడు కొంత మంది మహిళలు నెలలు నిండకుండా బిడ్డకు జన్మ ఇస్తే ఇంక్యుబేటర్ లో పెడుతున్నారు కదా.అలాంటి పద్దతే ఈ ఎక్టోలైఫ్.అయితే ఈ పద్దతికి చాల లీగల్ ఇస్యూస్ ఉండే అవకాశం ఉంది.ఈ ఎక్టోలైఫ్ లో కొన్ని విచిత్రమైన సౌలభ్యాలు కూడా ఉన్నాయ్.

పుట్టబోయే బిడ్డ రంగు, ఎత్తు, కళ్ళు, ముక్కు తీరు, జెనటికల్ మార్పులు అన్ని కూడా తమకు నచ్చినట్టు గా పెట్టుకోవచ్చట.ఇంత కన్నా దారుణం మరొకటి ఉంటుందా ? ఎంత కష్టానికైనా ఓర్చి బిడ్డను కని, చూసుకొని మురిసిపోయే తల్లులు ఉన్న ఈ ప్రపంచంలో ఎలా బిడ్డను కనాలో, ఏ రంగులో కనాలో కూడా ముందే డిసైడ్ చేస్తే ఇంకా మాతృత్వపు మధురిమ ఎలా ఉంటుంది.ఈ ప్రెడిజైన్డ్ బిడ్డలను కనడానికి కొంత మంది ఆసక్తి చూపచ్చు.ఇలా డిజైన్డ్ బిడ్డలు హై క్లాస్ పిల్లలుగా మాములు పిల్లలు లో- క్లాస్ పిల్లలుగా రేపటి రోజు ప్రపంచం మారిపోవచ్చు.







