దేవాలయాలలో ఘనంగా జరిగిన కార్తీక మాసం వేడుకలు..
TeluguStop.com
మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తిక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూ ఉంటారు.
కార్తీక మాసం సందర్బంగా దేవాలయాలన్ని భక్తులతో రద్దీగా ఉంటాయి.కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో భక్తులు అలంకరిస్తూ ఉంటారు.
చాలా రకాల వంటలతో నైవేద్యాన్ని భగవంతునికి సమర్పించుకుంటూ ఉంటారు.దానితోపాటు దీపాలు వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటారు.
అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.
స్వామి వారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు.ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు ఎంతో భక్తితో చేస్తారు.
మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్జీ మహరాజ్ ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు.
భక్తుల రద్దీతో మఠం కళకళలాడుతుంది.మన దేశంలోని చాలా దేవాలయాల్లో కార్తిక మాసం వేడుకలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరిస్తారు.
"""/"/
తిరుపతమ్మ, గోపయ్య స్వాముల అంతరాలయం, ఆలయంలో కొలువుదీరిన సహదేవతల ఆలయాలను దీపాల తో అలంకరించి ఎంతో భక్తితో పూజలు చేస్తారు.
ప్రత్యేకమైన దీపాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేసి, ఆ తర్వాత దీపాలను వెలిగించి దీపారాధన కూడా చేస్తారు.
మన దేశ వ్యాప్తంగా కార్తీక మాసాన్ని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పాటు ఎంతో సంతోషంగా పండుగను చేసుకుంటారు.
కార్తీక మాసం 30 రోజులపాటు ఒక్కొక్క రోజు ఒక్క రకమైన పిండి వంటకాలను వండి దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.
మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్… గుడ్ న్యూస్ చెప్పిన నటి!