Surya Kumar Yadav: ఒక్క మ్యాచ్ లోనే అన్ని రికార్డులు నమోదు చేసిన మిస్టర్ 360..

ప్రస్తుతం టీమిండియాలో ఏ స్థానంలో అయినా పరుగుల వరద బాధిస్తున్న సూర్య కుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.సంవత్సర కాలం పాటు టి20 క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు.

 Surya Kumar Yadav Consecutive Records In A Match Details, Surya Kumar Yadav , Su-TeluguStop.com

గడిచిన సంవత్సర కాలం నుండి భారత టీం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాటర్ ఎవరంటే మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు అని పిలుచుకునే సూర్య కుమార్ యాదవ్ అని టీమిండియా క్రికెట్ అభిమానులు ఎవరైనా చెబుతారు.ఒక క్యాలెండర్ సంవత్సరంలో టి20 క్రికెట్లో 1000 పరుగులకు పైగా సాధించిన రెండవ బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు.

ఇంకా చెప్పాలంటే ఒకే సంవత్సరంలో వెయ్యి పరుగులు చేసిన మొదటి టీమ్ ఇండియా ప్లేయర్గా కూడా రికార్డ్ సృష్టించాడు.

సూర్య కంటే ముందు పాకిస్తాన్ ఓపెనర్ 2021 క్యాలెండర్ సంవత్సరం లో మహ్మద్ రిజ్వాన్ 1326 పరుగులు చేశాడు.

సూర్య కుమార్ యాదవ్ జింబాబ్వేపై 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.అయితే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఫాసెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన నాలుగో టీమిండియా క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు.

అయితే అంతర్జాతీయ టి20 క్రికెట్లో చివరి 5 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసినా మూడవ టీం ఇండియా బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.

Telugu Cricket, Cricketersurya, India Zim, Mohammad Rizwan, Cup-Sports News క�

ఇక, టీ20ల్లో లాస్ట్ ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసి మూడో టీమిండియా బ్యాటర్ గా ఘనత సాధించాడు సూర్య.జింబాబ్వేపై లాస్ట్ ఐదు ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సాధించాడు.ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు.టీ20 ప్రపంచకప్ లో టోర్నీలో దాదాపు 20 ఓవర్లు ఆడి అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు.2022 మెగాటోర్నీలో సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 193.96.ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం టి20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube