Ram Pothineni Akkineni Akhil : టైర్ 2 హీరోలకు ప్రెజెంట్ బ్యాడ్ టైం నడుస్తుందా.. మరి కలిసి వచ్చేది ఎప్పుడు?

టైర్ 1 హీరోలు నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉంటారు.ఇక ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమే అయ్యింది.

 Tier 2 Heros Latest Movie Updates , Tier 2 Heros, Tollywood, Ram Pothineni, Nani-TeluguStop.com

అయితే టైర్ 2 హీరోలు అలా కాదు.వీరు ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాల వల్లనే ఏడాది మొత్తం ఇండస్ట్రీ కళకళ లాడుతుంది.

కానీ కోవిద్ దీనిని పూర్తిగా మార్చేసింది.

కోవిద్ తర్వాత టైర్ 2 హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు.విడుదల అయినా ఒకటి అర మినహా మొత్తం సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.

దీంతో బాక్సాఫీస్ కూడా వెలవెల బోతుంది.నాని, నాగ చైతన్య, గోపీచంద్, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ మధ్య కాలంలో అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యారు.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో వచ్చి దారుణమైన ప్లాప్ అందుకున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలతో వచ్చి చతికిల పడ్డాడు.ఇక నాని కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు.

Telugu Akkineni Akhil, Nani, Ram Pothineni, Tier Heros, Tierheros, Tollywood-Mov

శ్యామ్ సింగరాయ్ తో ఓకే అనిపించినా నాని ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో దారుణంగా విఫలం అయ్యాడు.ప్రెసెంట్ నాని నటిస్తున్న దసరా సినిమా అయినా ఈయనకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఇక నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా వంటి ప్లాపులతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు.అలాగే రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో పర్వాలేదు అనిపించు కున్నారు.

ఇలా వీరంతా నెక్స్ట్ సినిమాలతో అయినా హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube