Allu Arjun Sweatshirt : స్టార్ హీరో అల్లు అర్జున్ ధరించిన ఈ స్వెట్ షర్ట్ ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Allu Arjun Spotted At Hyderabad Airport In Burberry Monogram Motif Sweatshirt K-TeluguStop.com

సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాతో( Pushpa 1 ) పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు బన్నీ.అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సాధించని ఘనతను సాధించారు అల్లు అర్జున్.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2( Pushpa 2 ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే బెర్లిన్ కు( Berlin ) బయలుదేరిన బన్ని, ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.అయితే ఎప్పుడు తన ట్రెండీ స్టైలీష్ లుక్స్‏తో స్పెషల్ అభిమానులను ఆకట్టుకుంటారు బన్నీ.

ఇటీవలే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బుర్బెర్రీ మోనోగ్రామ్ మోటిఫ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ధరించి కనిపించాడు.

ఈ షర్ట్ ధర సుమార రూ.28,000. లగ్జరీ, కంఫర్ట్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు బన్నీ.

అయితే ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంత సింపుల్ గా ఉన్న షర్టు ఏకంగా అన్ని వేల అంటూ షాకవతున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అందులో అల్లు అర్జున్ గడ్డం పెంచుకొని క్యాప్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube