క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే అద్భుత గింజలివి.. మీరు తింటున్నారా?

ఇటీవల కాలంలో క్యాన్సర్( Cancer ) బారిన పడుతున్న‌ వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్.

 These Are Miraculous Seeds That Reduce The Risk Of Cancer , Papaya Seeds,-TeluguStop.com

ఇలా ఎన్నో ర‌కాల క్యాన్స‌ర్లు ఉన్నాయి.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఎంతో మంది క్యాన్సర్ కు గురవుతున్నారు.

కొంద‌రు ఆ మ‌హ‌మ్మారితో పోరాడ‌లేక ప్రాణాలు విడుస్తున్నారు.క్యాన్సర్ ఒక మనిషిని మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ కృంగ‌దీస్తుంది.

అందుకే క్యాన్సర్ అంటే భ‌య‌పడుతుంటారు.అయితే క్యాన్స‌ర్‌ వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిల్లో బొప్పాయి గింజలు ఒకటి.

దాదాపు అందరూ బొప్పాయి పండును తింటారు.కానీ లోపల ఉండే గింజల‌ను మాత్రం తీసి డ‌స్ట్ బిన్‌లోకి తీసేస్తుంటారు.

కానీ బొప్పాయి పండు మాత్రమే కాదు గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ప్రోటీన్ తో పాటు బొప్పాయి గింజ‌ల్లో( papaya seeds ) శక్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.

Telugu Cancer, Cancer Seeds, Tips, Latest, Papaya Seeds, Papayaseeds-Telugu Heal

అందువ‌ల్ల బొప్పాయి గింజ‌లు( papaya seeds ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ప్రధానంగా చెప్పుకోవాలంటే బొప్పాయి గింజలు క్యాన్సర్ రిస్క్ ను చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి.ఇవి బలమైన యాంటీఆక్సిడెంట్లు.అవి మీ శరీరాన్ని అనేక రకాల క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.అలాగే బొప్పాయి గింజలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

అధిక కొలెస్ట్రాల్( High cholesterol ) ను కరిగిస్తాయి.ఒత్తిడిని చిత్తు చేస్తాయి.

దీర్ఘకాలిక వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.

Telugu Cancer, Cancer Seeds, Tips, Latest, Papaya Seeds, Papayaseeds-Telugu Heal

అందుకే బొప్పాయితో పాటు వాటి గింజలను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇక బొప్పాయి గింజలను నేరుగా తినొచ్చు.ఇవి చేదు మరియు మిరియాలు రుచిని క‌లిగి ఉంటాయి.

ఒక‌వేళ నేరుగా తిన‌లేము అనుకునేవారు బొప్పాయి గింజలను స్మూతీలలో క‌లిసి తీసుకోవచ్చు.సలాడ్స్ లో టాపింగ్ గా ఉపయోగించవచ్చు.

పెరుగులో కలిపి తిన‌వ‌చ్చు.బొప్ప‌యి గింజ‌ల‌ను పేస్ట్ చేసి తేనె క‌లిపి తీసుకోవ‌చ్చు.

వోట్మీల్ తో పాటు కూడా తినొచ్చు.ఇలా ఎలా తీసుకున్నా కూడా బొప్పాయి గింజ‌లు మీకు ఎంతో మేలు చేస్తాయి.

కానీ, అతిగా మాత్రం తిన‌కండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube