బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తృటిలో పెద్ద ప్రమాడం నుంచి తప్పించుకున్నారు.గోదావరి ముంపు ప్రాంతంను పరిశీలించేందుకు వెళ్లిన గ్రామస్తులను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎర్ధండి లో గ్రామస్తులు అడ్డుకున్నారు.
తమ గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటూ అరవింద్ ను నిలదీశారు.
ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు.
ఆ తరువాత అరవింద్ గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లగా , మరోసారి గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కాన్వాయ్ కు అడ్డు వచ్చిన గ్రామస్తులను పోలీసులు తప్పించి అరవింద్ కాన్వాయ్ ను ముందుకు పంపించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఎంపీ కాన్వాయ్ పై రాళ్లు , కర్రలతో దాడులు నిర్వహించారు.ఈ ఘటనలో అరవింద్ కాన్వయలోని రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై బిజెపి తీవ్రస్థాయిలో స్పందించింది .ఈ దాడులు టీఆర్ఎస్ గూండాల పనేనని మండిపడింది.అసలు ఈ ఘటనకు కారణం మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు ఎంపీ ని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకొన్నారు.అయినా ఈ విషయాన్ని అరవింద్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు అరవింద్ తమ గ్రామంలోకి రాగానే ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటూ ప్రశ్నించారు .ఓట్లు వేయించుకునేందుకు చేతులు జోడించి మొక్కే బోటకపు రాజకీయాలకు ఈ గ్రామం స్వస్తి పలుకుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వరద ముంపునకు గురైన మా గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుని మాకు న్యాయం చేయాలని వివాదంలో ఉన్న మల్లన్న గుట్ట భూమి మాకు చెందే వరకు మా పోరాటం ఆగదంటూ గ్రామస్తులు నిదాదాలు చేశారు
.






