కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.
ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఇక తమిళ నాడు లో అయినా ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.
ఈయన అంటే కేవలం సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాదు. సినీ సెలెబ్రెటీలకు కూడా గౌరవం ఉంది.
ఇక ఈయన కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.2005 లో రిలీజ్ అయినా ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా.శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో ప్రభు, రామ్ కుమార్ గణేషన్ కలిసి నిర్మించారు.ఈ సినిమాకు ముందు రజనీకాంత్ వరుసగా ప్లాపులు ఎదుర్కొంటూ ఉన్నారు.

అదే సమయంలో చంద్రముఖి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి సూపర్ స్టార్ ఫామ్ లోకి వచ్చాడు.ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది.పి వాసు డైరెక్ట్ చేయబోతుండగా.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అయితే ఈసారి ఇందులో హీరో రజనీకాంత్ కాదు.

రాఘవ లారెన్స్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ముందు రజనీకాంత్ ఆశీస్సులు తీసుకునేందుకు లారెన్స్ ఆయనను కలిశారు.ఈ సంద్రాభంగా రజనీకాంత్ కాళ్ళు మొక్కి మరీ షూటింగ్ లో అడుగు పెట్టేందుకు లారెన్స్ సిద్ధం అయ్యాడు.ఈ రోజు మైసూరు లో రజనీకాంత్ ఆశీర్వాదంతో స్టార్ట్ అయినట్టు లారెన్స్ తెలిపారు.
దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.







