దాల్చిన చెక్క.దీని గురించి పరిచయాలు అవసరం లేదు.
ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే దాల్చిన చెక్కను వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.అలాగే విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగానూ దాల్చిన చెక్క అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
అయితే ఎంత మేలు చేసినప్పటికీ.దాల్చిన చెక్కను కొందరు తీసుకోరాదు.
ఆ కొందరు ఎవరు.? వారు ఎందుకు తీసుకోరాదు.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి దాల్చిన చెక్క ఉంది.అందుకే మధుమేహం ఉన్న వారు దాల్చిన చెక్కను డైట్‌లో చేర్చుకుంటే మంచిదని అంటుంటారు.అయితే కొందరికి ఉండాల్సిన దాని కంటే తక్కువ షుగర్ లెవల్స్ ఉంటాయి.
అలాంటి వారు దాల్చిన చెక్కను ఎవైడ్ చేయాలి.లేకుంటే షుగర్ లెవల్స్ మరింత దిగజారి అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు కూడా దాల్చిన చెక్కను తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు నిపుణులు.ప్రెగ్నెన్నీ సమయంలో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అకాల ప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయి.
మరియు గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలూ ఇబ్బంది పెడతాయి.

లివర్ సమస్యలతో బాధ పడే వారు కూడా దాల్చిన చెక్కను తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే, దాల్చిన చెక్కలో కౌమరిన్ అనే సమ్మేళనం లివర్ వ్యాధులను మరింత తీవ్ర తరం చేస్తుంది.కామెర్ల బారిన పడిన వారూ, రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్లు వాడే వారూ, నోట్లో పుండ్లు.
పూతలతో ఇబ్బంది పడే వారు సైతం దాల్చిన చెక్కకు దూరంగా ఉంటడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.