ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లను సాధిస్తోందనే సంగతి తెలిసిందే.కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలతో ఊహించని స్థాయిలో యశ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో యశ్ ఈ స్థాయికి ఎదిగారు.300 రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టిన యశ్ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ కెరీర్ తొలినాళ్లలో సపోర్టింగ్ రోల్స్ లో నటించడంతో పాటు సీరియళ్లలో కూడా నటించారు.రాకీ అనే మూవీతో యశ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు దేశవిదేశాల్లో కోట్ల సంఖ్యలో ప్రేక్షకులు యశ్ ను అభిమానించడానికి కారణమయ్యాయి.
పాన్ ఇండియా హీరోగా యశ్ కు సినిమాసినిమాకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
యశ్ తర్వాత సినిమా డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.సినిమాలో తాను ఇండియాకే సీఈవోనని చెప్పే డైలాగ్ తో యశ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలను చూసిన ప్రేక్షకులు రాకీ భాయ్ పాత్రలో యశ్ మినహా మరెవరినీ ఊహించుకోలేరని చెప్పవచ్చు.నెగిటివ్ షేడ్స్ ఉన్న రాకీభాయ్ పాత్రలో అద్భుతంగా నటించి యశ్ తన నటనతో మెప్పించారు.
కేజీఎఫ్2 సినిమాలో సెకండాఫ్ లోని ఒక్కో సీన్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంది.ప్రస్తుతం యశ్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఫోటోలో యశ్ చాలా క్యూట్ గా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
యశ్ కు కేజీఎఫ్ సిరీస్ సినిమాల సక్సెస్ వల్ల సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.యశ్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.