దేశంలోని చాలామంది తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేయడం కొత్త విషయం కాదు.అది BMW లేదా SUV వాహనాలు కావచ్చు.
దానికి ఫ్యాన్సీ నంబర్ ఉండాలని కోరుకుంటారు.చాలామంది తమ వాహనంపై ప్రత్యేకమైన నంబర్ ప్లేట్‌ను ఉంచడానికి ఇష్టపడతారు.
అయితే బైక్‌ల విషయంలో ఈ క్రేజ్ చాలా అరుదుగా కనిపిస్తుంది.అదే సమయంలో స్కూటీ గురించి ప్రస్తావనకు వస్తే దీని నంబర్ ప్లేట్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.
అయితే ఓ వ్యక్తి తన స్కూటీ నెంబర్ ప్లేట్ కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన ఉదంతం ఆసక్తికరంగా మారింది.తాజాగా చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని లక్షల రూపాయలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నాడు.మీడియా నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ CH01-CJ-0001ని కొనుగోలు చేయడానికి 15.44 లక్షలకు బిడ్ వేశారు.అతను తన స్కూటీ హోండా యాక్టివాకు ఫ్యాన్సీ నంబరు తగిలించేందుకు రూ.15 లక్షల కంటే ఎక్కువ ధర వెచ్చించాడని తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు.ఆ వ్యక్తి వద్ద 71,000 విలువైన స్కూటీ ఉంది.
దానికి ఫ్యాన్సీ నంబర్ అతికించేందుకు అతను బిడ్డింగ్‌లో పాల్గొన్నాడు.
బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ ‘నేను ఇటీవల కొనుగోలు చేసిన నా యాక్టివా కోసం ఈ నంబర్‌ను ఉపయోగిస్తానన్నాడు.కాగా S-క్లాస్ Mercedes-Benz యజమాని 2012లో 0001 నంబర్ కోసం ఆల్-టైమ్ హై బిడ్ ₹26.05 లక్షలకు సొంతం చేసుకున్నాడు.చండీగఢ్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అథారిటీ ఏప్రిల్ 14 నుంచి 16 వరకు CH01-CJ సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్‌లు ఇతర నంబర్‌ల కోసం వేలం నిర్వహించింది.
ఈ సమయంలో నంబర్ ప్లేట్ కోసం 378 సిరీస్ నంబర్లు వేలం వేశారు.ఈ సిరీస్ కోసం బిడ్డర్లు మొత్తం రూ.1.5 కోట్లు వెచ్చించారు.CH01-CJ-0002 నంబర్ ప్లేట్ రూ.5.4 లక్షలకు అమ్ముడు పోయిన రెండవ అత్యంత ఖరీదైన నంబర్.