ఆస్తమా కోసం సమర్ధవంతమైన ఇంటి నివారణలు

అస్తమా అనేది శ్వాసకు ఇబ్బంది కలిగించే ఒక ఊపిరితిత్తుల వ్యాధి.అస్తమా దీర్ఘ కాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు.

ఊపిరితిత్తులలో గాలికి అవరోధం ఏర్పడినప్పుడు అస్తమా వస్తుంది.అస్తమా రావటానికి ఖచ్చితమైన కారణాలు లేవు.

కానీ ఆహారం, కొన్ని రకాల మందులు అలెర్జీలు, వాయు కాలుష్యం, శ్వాసకోశ అంటువ్యాధులు, భావోద్వేగాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కారణం కావచ్చు.దగ్గు, శ్వాసలో గురక, శ్వాస ఆడకపోవుటం మరియు ఛాతీ బిగుతుగా ఉండటం వంటివి సాదారణ లక్షణాలుగా ఉంటాయి.అయితే కొన్ని ఇంటి నివారణల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

1.అల్లం

అల్లం అనేది అస్తమాతో సహా అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.ఇది గాలి మార్గంలో సంకోచాలను నిరోదించటానికి మరియు మంట తగ్గటానికి సహాయం చేస్తుందని పరిశోదకులు కనుగొన్నారు.

* ఒక బౌల్ లో అల్లం రసం, దానిమ్మ రసం మరియు తేనెలను సమాన పరిమాణంలో తీసుకోని కలపాలి.ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు రెండు స్పూన్లు తీసుకోవాలి.

Advertisement

* ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ అల్లం రసాన్ని కలిపి రాత్రి పడుకొనే సమయంలో త్రాగాలి.* అల్లంను ముక్కలుగా కోసి వేడి నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత త్రాగాలి.

* ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ మెంతులను వేసి మరిగించాలి.ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ అల్లం రసం,ఒక స్పూన్ తేనే కలిపి ఉదయం,రాత్రి సమయాల్లో త్రాగాలి.* అలాగే పచ్చి అల్లంతో ఉప్పు కలిపి కూడా తినవచ్చు.

2.ఆవాల నూనె

అస్తమా దాడి జరిగినప్పుడు, ఆవాల నూనెతో మసాజ్ చేస్తే శ్వాస ప్రకరణములు క్లియర్ అయ్యి సాధారణ శ్వాస పునరుద్దరణ జరుగుతుంది.

* ఆవాల నూనెలో కొంచెం కర్పూరం వేసి వేడి చేయాలి.* ఈ నూనె కొంచెం వేడి తగ్గాక ఛాతీ మరియు వీపు మీద నిదానంగా మర్దన చేయాలి.* అస్తమా తగ్గేవరకు రోజులో అనేక సార్లు ఈ విధంగా మసాజ్ చేయాలి.

3.అత్తి పండ్లు

అత్తి పండ్లలో ఉండే పోషకాలు శ్వాస ఆరోగ్యాన్ని ప్రోత్సహించి శ్వాస సమస్యలను తగ్గించటంలో సహాయపడతాయి.

* రాత్రి సమయంలో ఒక కప్పు నీటిలో ఎండిన అత్తి పండ్లను నానబెట్టాలి.* మరుసటి రోజు ఉదయం నానబెట్టిన అత్తి పండ్లను ఖాళీ కడుపుతో తినాలి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
అండాశయ క్యాన్సర్ ఎందుకు వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఈ విధంగా రెండు నెలల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

Advertisement

తాజా వార్తలు