తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న వివిధ రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీకి ఏడాది పూర్తి కాబోతున్న నేపథ్యంలో, విజయోత్సవాలు నిర్వహించే విషయంలో అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు .
ఈ మేరకు ఏఐసిసి పెద్దలతో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.వారందరిని విజయోత్సవాలకు హాజరు కావలసిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 9 న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం( Mother of Telangana statue unveiling event ) ఉన్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి సైతం హాజరవ్వాల్సిందిగా రేవంత్ ఆహ్వానించనున్నారు.
ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు.ఎప్పటి నుంచో 6 మంత్రి స్థానాల భర్తీపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
అయితే ఎప్పుడుకప్పుడు ఏదో ఒక అడ్డంకి ఏర్పడడంతో అది కాస్త వాయిదా పడుతూ వస్తోంది.
దీంతో ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి , ఎవరెవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలి, ఏ ఏ సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలపైనా చర్చించనున్నారట.వీలైనంత తొందరగా మంత్రి వర్గాన్ని విస్తరించి, పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారట.డిసెంబర్ రెండో వారం లో అసెంబ్లీ సమావేశాల ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ సమావేశాల కంటే ముందుగానే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలి అనే ఆలోచనతో రేవంత్ ఉన్నారట.వీటితో పాటు, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ , కుల గణన వంటి అంశాలపైనా రేవంత్ చర్చించనున్నారట.